సాఫ్ట్‌వేర్‌తో పోస్టల్ ఖజానా పదిలం
తపాలాశాఖ తన కోశాగారం, కీలక సమాచార రక్షణ కోసం ఫేస్ రిజిస్ట్రేషన్, సాఫ్ట్‌వేర్ రక్షణ సదుపాయాన్ని కల్పించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రా)లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది తపాల శాఖ ఆదాయం భారీగా పెరగడం, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లాభాల బాట పట్టనుండడం, ఎస్‌బీఐ వంటి భారీ బ్యాంకింగ్ సంస్థలతోపాటు అంతర్జాతీయ కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో తమ ఖజానా, రోజువారీ కార్యకలపాల భద్రత కోసం పోస్టల్ […]
Advertisement
తపాలాశాఖ తన కోశాగారం, కీలక సమాచార రక్షణ కోసం ఫేస్ రిజిస్ట్రేషన్, సాఫ్ట్‌వేర్ రక్షణ సదుపాయాన్ని కల్పించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రా)లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది తపాల శాఖ ఆదాయం భారీగా పెరగడం, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లాభాల బాట పట్టనుండడం, ఎస్‌బీఐ వంటి భారీ బ్యాంకింగ్ సంస్థలతోపాటు అంతర్జాతీయ కొరియర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో తమ ఖజానా, రోజువారీ కార్యకలపాల భద్రత కోసం పోస్టల్ శాఖ సాఫ్ట్‌వేర్ తో పటిష్ఠమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను పోస్టల్ శాఖ సొంతంగానే రూపొందించింది. అయితే, అందుకు అవసరమైన పరికరాలను మాత్రం ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసింది. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను కోశాగారం, సర్వర్ గదులకు అనుసంధానించి, ముగ్గురు అధికారుల ముఖాలను, బొటనవేలి ముద్రలనూ పాస్‌వర్డ్‌గా తీసుకుంటారు. అందుకు సంబంధిత పరికరాలను ఆ గదుల తలుపుల వద్ద ఏర్పాటు చేస్తారు. పరికరంలో గుర్తులు నమోదైన అధికారుల చిత్రాలతో సరిపోలితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత బొటవవేలి ముద్ర సరిపోతేనే తలుపు తెరుచుకుంటుంది. అనుమతి ఉన్న అధికారులు గది లోనికి వెళ్లినప్పుడు వారు ప్రవేశించిన సమయంతోపాటు ఫొటో కూడా రికార్డవుతుంది. దానిని ప్రింట్ రూపంలో కూడా తీసుకునే సౌలభ్యముంది. దీనివల్ల అనుమతి ఉన్న అధికారులు తప్పు చేసినా సులభంగా దొరికిపోతారు. ఫేస్ రిజిస్ట్రేషన్ వల్ల ఇతరులు లోనికి వచ్చే అవకాశం లేకపోవడంతో తపాలాశాఖ నిధులు, కీలక సమాచారానికి పూర్తి భద్రత లభిస్తుంది.
Advertisement