వివాదాల సుడిగుండంలో ఈఎస్ఐ విభ‌జ‌న 

కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) విభ‌జ‌న వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఉద్యోగుల పంప‌కాలు, రెండు  రాష్ట్రాలకు కేటాయించిన బ‌డ్జెట్‌తో పాటు ఇన్సూర్డ్ ప‌ర్సన్స్ (ఐపీ) కోసం కూడా రెండు రాష్ట్రాల  అధికారుల మ‌ధ్య వివాదం ఏర్ప‌డింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈఎస్ఐ ప‌రిధిలో మొత్తం 15 ల‌క్ష‌ల ఐపీలుండ‌గా, తెలంగాణ‌లో 10 ల‌క్ష‌లు, ఆంధ్రాలో 5 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ప్ర‌భుత్వం  ఒక్కొక్క ఐపీకి రూ. 1500 నుంచి రూ. 2 వేల వ‌ర‌కు మెడిక‌ల్ బ‌డ్జెట్‌ను కేటాయిస్తోంది. […]

Advertisement
Update:2015-07-05 18:52 IST
కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) విభ‌జ‌న వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఉద్యోగుల పంప‌కాలు, రెండు రాష్ట్రాలకు కేటాయించిన బ‌డ్జెట్‌తో పాటు ఇన్సూర్డ్ ప‌ర్సన్స్ (ఐపీ) కోసం కూడా రెండు రాష్ట్రాల అధికారుల మ‌ధ్య వివాదం ఏర్ప‌డింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈఎస్ఐ ప‌రిధిలో మొత్తం 15 ల‌క్ష‌ల ఐపీలుండ‌గా, తెలంగాణ‌లో 10 ల‌క్ష‌లు, ఆంధ్రాలో 5 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ప్ర‌భుత్వం ఒక్కొక్క ఐపీకి రూ. 1500 నుంచి రూ. 2 వేల వ‌ర‌కు మెడిక‌ల్ బ‌డ్జెట్‌ను కేటాయిస్తోంది. ఈ బ‌డ్జెటే రెండు రాష్ట్రాల డైరెక్ట‌ర్ల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో జ‌నాభా ప్రాతిప‌దిక‌న 58-42 దామాషాలో ఐపీల విభ‌జ‌న జ‌రిగింది. అయితే, తెలంగాణ‌లో ఐపీల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నారు క‌నుక 65-35 శాతం దామాషా ప్రాతిప‌దిక‌న విభ‌జ‌న చేయాల‌ని ఆ రాష్ట్ర అధికారులు ఒత్తిడి చేశారు. అందుకు ఆంధ్రా అధికారులు కూడా అంగీక‌రించారు. దీంతో వ‌చ్చే సంవ‌త్స‌రం నుంచి తెలంగాణ‌కు 65 శాతం, ఆంధ్రాకు 35 శాతం బ‌డ్జెట్ కేటాయించ‌నున్నారు. దీనిపై మ‌రికొద్దిరోజుల్లోనే స్ప‌ష్ట‌త ల‌భిస్తుంది. అయితే, రెండు రాష్ట్రాల ఈఎస్ఐ అధికారుల మ‌ధ్య రోగుల పంప‌కాల్లో పెద్ద‌గా వివాదం నెల‌కొన‌క పోయినా, ఉద్యోగుల విభ‌జ‌న మాత్రం వివాదాస్ప‌దంగా మారింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో మొత్తం 112 మంది ఉద్యోగులున్నారు. వీరిని 65-35 శాతం ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌డానికి వీల్లేద‌ని ఆంధ్రా ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు. ఏపీలో ఈఎస్ఐ ఏర్పాటు చేసిన త‌ర్వాత పోస్టులు లేక పోతే త‌మ భ‌విష్య‌త్ ఏమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ డైరెక్ట‌ర్ ప్ర‌తిపాదించిన వ్య‌క్తిని ఏపీ డైరెక్ట‌ర్ గా నియ‌మించ‌డం వ‌ల్ల‌నే త‌మ‌కు న‌ష్టం జ‌రిగింద‌ని వారు ఆరోపిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News