రాష్ట్రపతిని కలిసిన ఏపీ ప్రతిపక్షనేత జగన్
హైదరాబాద్‌లోని బొల్లారం అతిథిగృహంలో బస చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కూడా జగన్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ రాష్ట్రపతికి ఆంధ్రాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించడంతో పాటు తెలంగాణలో ఓటుకు కోట్లు ఉదంతంపై టీడీపీ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]
Advertisement
హైదరాబాద్‌లోని బొల్లారం అతిథిగృహంలో బస చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కూడా జగన్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ రాష్ట్రపతికి ఆంధ్రాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించడంతో పాటు తెలంగాణలో ఓటుకు కోట్లు ఉదంతంపై టీడీపీ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు పాల్పడటమే కాకుండా అధికారులు, పోలీస్ వ్యవస్థను కూడా ప్రభావితం చేసిందని అందువల్లే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించామని జగన్ ఆయనకు వివరించారని పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Advertisement