పొమ్మనలేక పొగ పెడుతున్నారు: దానం ఆరోపణ
తనను కాంగ్రెస్ నుంచి బయటకు పంపడానికి కొంతమంది కుట్ర జరుపుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్. తాను పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోతున్నానని ఇందులో భాగంగానే ప్రచారం చేస్తున్నారని తాను భావిస్తున్నానని దానం చెప్పారు. పొమ్మన లేక పొగ బెట్టినట్టుగా చేస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారో, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులున్నారో తనకు తెలీదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని […]
Advertisement
తనను కాంగ్రెస్ నుంచి బయటకు పంపడానికి కొంతమంది కుట్ర జరుపుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్. తాను పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోతున్నానని ఇందులో భాగంగానే ప్రచారం చేస్తున్నారని తాను భావిస్తున్నానని దానం చెప్పారు. పొమ్మన లేక పొగ బెట్టినట్టుగా చేస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారో, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులున్నారో తనకు తెలీదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని దానం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పుడు మాటలు విని పార్టీని బలహీనపరుస్తుంటే, దీన్ని టీఆర్‌ఎస్ అవకాశంగా ఉపయోగించుకుంటోందని దానం అన్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో విపక్షాలను బలహీన పర్చాలని టీఆర్‌ఎస్ చూస్తోందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ కలలు కంటోందని దానం నాగేందర్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ మేనిఫొస్టే అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నమని, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఓట్లను తొలగించడం ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తోందని అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని దానం అన్నారు.
.
Advertisement