అరటిపళ్ళ లారీ నుంచి రూ.3 కోట్ల గంజాయి స్వాధీనం
వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై అరటి గెలలతో వెళ్తున్న లారీలో తరలిస్తున్న రూ. 3 కోట్ల ఎండు గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఇది మొత్తం 3,960 కేజీలుంది. ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. తొర్రూరు సీఐ కె.శ్రీధర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తణుకు నుంచి వస్తున్న ఏపీ 16 టీఏ 0678 నెంబర్ గల లారీలో చిన్నచిన్న కవర్లలో రెండు కేజీల చొప్పున ఎండు గంజాయిని ప్యాక్ చేశారు. ఒక బస్తాల్లో 12 బ్యాగుల చొప్పున […]
Advertisement
వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై అరటి గెలలతో వెళ్తున్న లారీలో తరలిస్తున్న రూ. 3 కోట్ల ఎండు గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఇది మొత్తం 3,960 కేజీలుంది. ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. తొర్రూరు సీఐ కె.శ్రీధర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తణుకు నుంచి వస్తున్న ఏపీ 16 టీఏ 0678 నెంబర్ గల లారీలో చిన్నచిన్న కవర్లలో రెండు కేజీల చొప్పున ఎండు గంజాయిని ప్యాక్ చేశారు. ఒక బస్తాల్లో 12 బ్యాగుల చొప్పున 165 బస్తాల్లో 3960 కేజీల ఎండు గంజాయిని లారీలో పేర్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు లారీలో గంజాయిని కింది భాగంలో పేర్చి, పైన అరటి గెలలను లోడ్ చేశారు. పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా లారీలో ఉన్న గంజాయి వెలుగు చూసింది.
Advertisement