ముగ్గురు మరణిస్తూ 16 మంది జీవితాల్లో వెలుగు!
వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తర్వాత బ్రెయిడ్ డెడ్‌గా మారిన ముగ్గురు వ్యక్తుల అవయవాలతో 16 మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించింది నిమ్స్ జీవన్‌ధాన్ కేంద్రం. అవయవదానం చేసిన వారిలో ఒకరు వరంగల్ జిల్లా, మరో ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారని, వారి కుటుంబసభ్యుల సమ్మతి మేరకు వారి అవయవాలను ఇతరులకు అమర్చామని నిమ్స్ జీవన్‌ధాన్ కేంద్రం ప్రతినిధి అనురాధ చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన సదాశివ(43) గత నెల 29న జరిగిన రో డ్డు […]
Advertisement
వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తర్వాత బ్రెయిడ్ డెడ్‌గా మారిన ముగ్గురు వ్యక్తుల అవయవాలతో 16 మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించింది నిమ్స్ జీవన్‌ధాన్ కేంద్రం. అవయవదానం చేసిన వారిలో ఒకరు వరంగల్ జిల్లా, మరో ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారని, వారి కుటుంబసభ్యుల సమ్మతి మేరకు వారి అవయవాలను ఇతరులకు అమర్చామని నిమ్స్ జీవన్‌ధాన్ కేంద్రం ప్రతినిధి అనురాధ చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన సదాశివ(43) గత నెల 29న జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌అయి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు కిడ్నీలు, కంటి కార్ణియాలు, కాలేయాన్ని సేకరించారు. అలాగే రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఇ.యాదయ్య(50) గతనెల 29న ఇబ్రహీం పట్నంలో రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందాడు. కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించడంతో కిడ్నీలు, గుండె నాళాలు, కంటి కార్ణియాలు సేకరించినట్లు జీవన్‌ధాన్ కేంద్రం ప్రతినిధి అనురాధ తెలిపారు. మీర్‌పేటకు చెందిన అప్పారావు(58) గతనెల 30న మీర్‌పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతనిని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేయిదాటిపోగా వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. దీంతో అప్పారావు కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించగా కిడ్నీలు, రెటీనాలు, లివర్‌ను సేకరించినట్లు నిమ్స్ జీవన్‌ధాన్ కేంద్రం ప్రతినిధి స్వర్ణలత తెలిపారు. ఇప్పటి వరకు 138 దాతల నుంచి 632 అవయవాలు సేకరించి అవసరమైన వారికి అందజేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపామని ఆమె చెప్పారు.
Advertisement