త్వరలో డెంగ్యూ నివారణకు టీకా
డెంగ్యూ నివారణకు మెరుగైన మందు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పది కోట్ల మంది దోమకాటుతో వచ్చే డెంగ్యూ జ్వరం బారిన పడుతున్నారని శాస్త్రవేత్తల అంచనా. ఈ డెంగ్యూను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ముందడగు వేశాయి. దీంతో త్వరలోనే డెంగ్యూ నివారణకు మంచి టీకా మందు ప్రజలకు అందుబాటులోకి రానుంది. వాండర్ బిల్ట్ విశ్వవిద్యాలయం, సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా డెంగ్యూ టీకా మందు కోసం పరిశోధనలు నిర్వహించారు. అందులో భాగంగా హ్యూమన్ మోనోక్లోనల్ […]
Advertisement
డెంగ్యూ నివారణకు మెరుగైన మందు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పది కోట్ల మంది దోమకాటుతో వచ్చే డెంగ్యూ జ్వరం బారిన పడుతున్నారని శాస్త్రవేత్తల అంచనా. ఈ డెంగ్యూను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ముందడగు వేశాయి. దీంతో త్వరలోనే డెంగ్యూ నివారణకు మంచి టీకా మందు ప్రజలకు అందుబాటులోకి రానుంది. వాండర్ బిల్ట్ విశ్వవిద్యాలయం, సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా డెంగ్యూ టీకా మందు కోసం పరిశోధనలు నిర్వహించారు. అందులో భాగంగా హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీ బాడీ స్వరూపాన్ని వారు నిర్థారించారు. ఇది డెంగ్యూ వైరస్‌ను తొలగించడమే కాకుండా వ్యాధి తీవ్ర దశలోనూ అడ్డుకుంటుందని గుర్తించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు వారు సిద్ధమయ్యారు.
Advertisement