విద్యార్ధులను మోసం చేస్తోన్న నకిలీ వర్శిటీలు
విద్యార్థులను మోసం చేయడానికి నకిలీ యూనివర్శిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండకపోతే తర్వాత ఎంతో ఇబ్బంది పడతారని యూజీసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు ఉన్నాయని, విద్యార్థులు ఎవరూ ఈ యూనివర్శిటీల్లో చేరవద్దని, ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు కూడా డిగ్రీ సర్టిఫికెట్లు రావని యూజీసీ స్పష్టం చేసింది. ఈ నకిలీ యూనివర్శిటీలు ఉత్తరప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 6, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ […]
Advertisement
విద్యార్థులను మోసం చేయడానికి నకిలీ యూనివర్శిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండకపోతే తర్వాత ఎంతో ఇబ్బంది పడతారని యూజీసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు ఉన్నాయని, విద్యార్థులు ఎవరూ ఈ యూనివర్శిటీల్లో చేరవద్దని, ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు కూడా డిగ్రీ సర్టిఫికెట్లు రావని యూజీసీ స్పష్టం చేసింది. ఈ నకిలీ యూనివర్శిటీలు ఉత్తరప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 6, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి నడుస్తున్నాయని తెలిపింది. ఢిల్లీలోని వరన్సేయ సంస్కృత విశ్వ విద్యాలయ, కమర్షియల్ యూనివర్శిటీ, యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, వొకేషనల్ యూనివర్శిటీ, ఏడీఆర్ సెంట్రల్ జూరిడిషియల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లకు యూజీసీ గుర్తింపు లేదు. వీటితోపాటు కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ వర్శిటీ, కేరళకు చెందిన సెయింట్ జాన్స్ వర్శిటీ, మధ్యప్రదేశ్‌లోని కేసర్వానీ విద్యాపీఠ్, మహారాష్ట్రలో రాజా అరబిక్, తమిళనాడుకు చెందిన డీడీబీ సంస్కృత్ వర్శిటీలు, కోల్ కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్ట్ నేటివ్ మెడిసిన్, యూపీలోని మహిళాగ్రామ్ విద్యాపీఠ్, గాంధీ హిందీ విద్యాపీఠ్, కాన్పూర్ నేషనల్ వర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఓపెన్ వర్శిటీ, యూపీ విశ్వవిద్యాలయ, మహారాణా ప్రతాప్ శిక్షానికేతన్, ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, మథురలోని గురుకుల్ విశ్వవిద్యాలయ సంస్థలు చట్ట ప్రకారం గుర్తింపు లేనందున నకిలీ యూనివర్శిటీలుగా ప్రకటిస్తున్నట్లు యూజీసీ తెలిపింది.
Advertisement