టేబుల్‌ ఫ్యాన్‌లో 3 కేజీల బంగారం

బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేయ‌డానికి ర‌క‌ర‌కాల మార్గ‌ల‌ను అన్వేషిస్తున్నారు దొంగ‌లు. అంద‌రి మాదిరిగానే దుబాయ్ నుంచి ఓ ప్ర‌యాణికుడు వ‌చ్చాడు. త‌న ల‌గేజీ మొత్తాన్ని చెకింగ్‌కి ఇచ్చిన అత‌డు ఫ్యాన్‌ను మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంచేసుకున్నాడు. బ్యాగేజ్ అంతా చెక్ చేసిన త‌ర్వాత అనుమానం వ‌చ్చిన క‌స్ట‌మ్స్ అధికారులు ఫ్యాన్‌ను కూడా తీసుకుని చెక్ చేశారు. అస‌లు బంగార‌మంతా అందులోనే ఉంది. ఈ ప్ర‌యాణికుడి దగ్గర నుంచి తీసుకుని చెక్ చేసిన ఫ్యాన్‌లో మూడు కేజీల బంగారాన్ని క‌నుగొన్నారు. […]

Advertisement
Update:2015-07-02 18:42 IST
బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేయ‌డానికి ర‌క‌ర‌కాల మార్గ‌ల‌ను అన్వేషిస్తున్నారు దొంగ‌లు. అంద‌రి మాదిరిగానే దుబాయ్ నుంచి ఓ ప్ర‌యాణికుడు వ‌చ్చాడు. త‌న ల‌గేజీ మొత్తాన్ని చెకింగ్‌కి ఇచ్చిన అత‌డు ఫ్యాన్‌ను మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంచేసుకున్నాడు. బ్యాగేజ్ అంతా చెక్ చేసిన త‌ర్వాత అనుమానం వ‌చ్చిన క‌స్ట‌మ్స్ అధికారులు ఫ్యాన్‌ను కూడా తీసుకుని చెక్ చేశారు. అస‌లు బంగార‌మంతా అందులోనే ఉంది. ఈ ప్ర‌యాణికుడి దగ్గర నుంచి తీసుకుని చెక్ చేసిన ఫ్యాన్‌లో మూడు కేజీల బంగారాన్ని క‌నుగొన్నారు. దీన్ని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఈదిరస్‌ (40) కొంతకాలం క్రితం దుబాయ్‌ వెళ్లాడు. ఇతడు తిరిగి స్వదేశానికి వస్తూ మూడు కిలోల బంగారం దొంగచాటుగా తెచ్చేందుకు పథకం వేశాడు. దుబాయ్‌లోనే ఒక ఫ్యాను కొని దాని అడుగు భాగంలో 3 కిలోల బంగారం బిస్కట్లను తాప‌డం చేయించాడు. తనిఖీ చేసేందుకు తన బ్యాగులన్నింటిని కస్టమ్స్‌ అధికారులకు ఇచ్చిన అతడు ఫ్యాన్‌ను మాత్రం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఫ్యాన్‌ను కూడా పరిశీలించగా.. అందులో బంగారం బిస్కట్లు తాప‌డం చేయించినట‌్టు తేలింది.
Tags:    
Advertisement

Similar News