రూ. వెయ్యి కోట్ల‌తో గోదాములు " మంత్రి హ‌రీశ్ 

కార్మికుల‌కు ఏడాది పొడ‌వునా ప‌ని క‌ల్పించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రూ. వెయ్యి కోట్ల‌తో మండ‌లానికో గోదాము నిర్మించనున్న‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. 16.40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల గోదాముల‌ను ఆరు నెల‌ల్లో నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని ఆయ‌న తెలిపారు. గోదాముల నిర్మాణం వ‌ల‌న కార్మికుల‌కు 365 రోజులు ప‌ని ల‌భిస్తుంద‌ని, దీనివ‌ల్ల వారి కుటుంబాల‌కు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని మంత్రి అన్నారు. మార్కెట్ యార్డుల‌కు వ‌చ్చే రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు చెల్లించాల‌ని, అందుకోసం […]

Advertisement
Update:2015-07-02 18:43 IST
కార్మికుల‌కు ఏడాది పొడ‌వునా ప‌ని క‌ల్పించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రూ. వెయ్యి కోట్ల‌తో మండ‌లానికో గోదాము నిర్మించనున్న‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. 16.40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల గోదాముల‌ను ఆరు నెల‌ల్లో నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని ఆయ‌న తెలిపారు. గోదాముల నిర్మాణం వ‌ల‌న కార్మికుల‌కు 365 రోజులు ప‌ని ల‌భిస్తుంద‌ని, దీనివ‌ల్ల వారి కుటుంబాల‌కు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని మంత్రి అన్నారు. మార్కెట్ యార్డుల‌కు వ‌చ్చే రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు చెల్లించాల‌ని, అందుకోసం త‌గిన ప్ర‌ణాళిక‌ల‌తో యార్డులు సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. త్వ‌ర‌లో ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అమ‌ల్లోకి తీసుకు రానుంద‌ని, ఈ విధానం ద్వారా రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. జూలై మూడు నుంచి 10వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నున్న హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలోని వ్య‌వ‌సాయ మార్కెట్ల‌లో ల‌క్ష మొక్క‌లు నాటాల‌ని మంత్రి ఆదేశించారు. మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా వాటి పెంప‌కం బాధ్య‌త‌ను కూడా మార్కెట్ క‌మిటీలు చేప‌ట్టాల‌ని ఆయ‌న అన్నారు.
Tags:    
Advertisement

Similar News