కాందహార్ హైజాక్‌పై ‘రా’ మాజీ చీఫ్ చెప్పిన నిజాలు
ఢిల్లీలో కూర్చున్న ఉన్నతాధికారుల వల్లే కాందహార్ హైజాక్‌ను ఆపలేకపోయామని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ ఆరోపించారు. ఆయన రాసిన ‘కశ్మీర్: ది వాజ్‌పేయి ఇయర్స్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఖాట్మండు నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే విమానం హైజాక్ అయినట్టు సమాచారం అందిందని, ఇంధనం కోసం కొంతసేపు అమృత్‌సర్‌లో ఆగినప్పుడు తీవ్రవాదులను మట్టుపెట్టడానికి ప్రణాళిక రచించామని, అయితే ఢిల్లీలో ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల అనుమతి లభించలేదని […]
Advertisement
ఢిల్లీలో కూర్చున్న ఉన్నతాధికారుల వల్లే కాందహార్ హైజాక్‌ను ఆపలేకపోయామని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ ఆరోపించారు. ఆయన రాసిన ‘కశ్మీర్: ది వాజ్‌పేయి ఇయర్స్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఖాట్మండు నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే విమానం హైజాక్ అయినట్టు సమాచారం అందిందని, ఇంధనం కోసం కొంతసేపు అమృత్‌సర్‌లో ఆగినప్పుడు తీవ్రవాదులను మట్టుపెట్టడానికి ప్రణాళిక రచించామని, అయితే ఢిల్లీలో ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల అనుమతి లభించలేదని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అప్పటి పంజాబ్ పోలీస్ చీఫ్ సరబ్‌జీత్ సింగ్ పక్కా ప్రణాళికలు రూపొందించారు. సుశిక్షితులైన కమాండోలను కూడా సిద్ధం చేశారు. అయినా ఫలితం లేకపోయిందని ఆయన తన పుస్తకంలో వివరించారు. ‘జైష్-ఎ-మహ్మద్’ వ్యవస్థాపకుడు మౌలనా మసూద్ అజహర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకునేందుకే కాందహార్ హైజాక్ జరిగిన విషయం తెలిసిందే.
Advertisement