డబుల్ కానున్నఎంపీల జీతాలు
పార్లమెంటులోని ఉభయసభల సభ్యుల జీతాలను రెట్టింపు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎంపీలతో పాటు వారి పిల్లలు, మనవలకు కూడా ఆరోగ్య సదుపాయాన్ని కల్పించాలని, మాజీ పార్లమెంటు సభ్యుల పెన్షన్‌ను రూ. 20 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని బీజేపీ ఎంపి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని పార్లమెంట్ వేతన సవరణ కమిటీ నివేదిక సమర్పించినట్లు ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. వేతన సవరణ సంఘం నిబంధనలకు లోబడే కొత్త ప్రతిపాదనలు చేసినట్టు ఆ […]
Advertisement
పార్లమెంటులోని ఉభయసభల సభ్యుల జీతాలను రెట్టింపు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎంపీలతో పాటు వారి పిల్లలు, మనవలకు కూడా ఆరోగ్య సదుపాయాన్ని కల్పించాలని, మాజీ పార్లమెంటు సభ్యుల పెన్షన్‌ను రూ. 20 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని బీజేపీ ఎంపి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని పార్లమెంట్ వేతన సవరణ కమిటీ నివేదిక సమర్పించినట్లు ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. వేతన సవరణ సంఘం నిబంధనలకు లోబడే కొత్త ప్రతిపాదనలు చేసినట్టు ఆ కమిటీ తన నివేదికలో పేర్కొంది. సుమారు 60 కొత్త ప్రతిపాదనలను కమిటీ సిఫారుసు చేసింది. పార్లమెంటు సభ్యులకు సమావేశాల సమయంలో ఖర్చులకు ఇస్తున్న రూ. 2 వేలను కూడా పెంచాలని, ఏడాదిలో 20 నుంచి 25 విమాన టికెట్లు, వారి సహాయకులకు కూడా విమాన టికెట్లను ఇవ్వాలని కమిటీ సూచించింది.
Advertisement