మదర్సాలు బడులు కాదు " మహారాష్ట్ర మంత్రి
ప్రభుత్వ పాఠాలను బోధించే విద్యాసంస్థలను మాత్రమే పాఠశాలలుగా గుర్తిస్తామని, మత బోధనలు చేసే మదర్సాలను స్కూళ్లగా గుర్తించమని మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే స్పష్టం చేశారు. ఇకపై ప్రతి మదర్సాలోనూ ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ పాఠాలను తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,890 మదర్సాలుండగా కేవలం 550 మదర్సాలు మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను మదర్సాలు పాటించనందువల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. […]
Advertisement
ప్రభుత్వ పాఠాలను బోధించే విద్యాసంస్థలను మాత్రమే పాఠశాలలుగా గుర్తిస్తామని, మత బోధనలు చేసే మదర్సాలను స్కూళ్లగా గుర్తించమని మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే స్పష్టం చేశారు. ఇకపై ప్రతి మదర్సాలోనూ ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ పాఠాలను తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,890 మదర్సాలుండగా కేవలం 550 మదర్సాలు మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను మదర్సాలు పాటించనందువల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మదర్సాల్లో కేవలం మత పరమైన చదువు మాత్రమే బోధిస్తున్నందున అక్కడ చదువుకున్న విద్యార్థులను బడికెళ్లని పిల్లలుగానే గుర్తిస్తామని ఆయన అన్నారు. మదర్సాల్లో కూడా ప్రాథమిక విద్యను బోధిస్తే వాటిని కూడా బడులుగా గుర్తిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మైనారిటీలు రాబోయే రోజుల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. కాగా మదర్సాలను పాఠశాలలుగా పరిగణిస్తామన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ చర్య తమకున్న హక్కును హరించడమేనని పేర్కొంది.
Advertisement