రేవంత్‌కు బెయిల్, సండ్ర ప్రత్యక్షం వ్యూహాత్మకమేనా?
ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఆయన ఇంతకాలం విచారణకు రాని సంగతి తెలిసిందే! అయితే రేవంత్ రెడ్డి బెయిల్‌పై రాగానే ఆయన ప్రత్యక్షమవడం గమనార్హం. ఏసీబీ విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా హాజరవుతానని పాత మాటే చెప్పారు. ఇంతకాలం ఏపీలో చికిత్స తీసుకున్నానని, అందుకే విచారణకు హాజరు కాలేకపోయానని పేర్కొన్నారు. సండ్ర వ్యాఖ్యలు టీఆర్ ఎస్ నేతల ఆరోపణలకు బలం […]
Advertisement
ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఆయన ఇంతకాలం విచారణకు రాని సంగతి తెలిసిందే! అయితే రేవంత్ రెడ్డి బెయిల్‌పై రాగానే ఆయన ప్రత్యక్షమవడం గమనార్హం. ఏసీబీ విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా హాజరవుతానని పాత మాటే చెప్పారు. ఇంతకాలం ఏపీలో చికిత్స తీసుకున్నానని, అందుకే విచారణకు హాజరు కాలేకపోయానని పేర్కొన్నారు. సండ్ర వ్యాఖ్యలు టీఆర్ ఎస్ నేతల ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఈ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీ సీఎం చంద్రబాబే సండ్రను ఏపీలో దాచాడని వారు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. నిజంగా విచారణకు సహకరించే ఉద్దేశం ఉంటే.. పోలీసులకు తానెక్కడున్నది ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో సండ్ర వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఏసీబీ అనుమానిస్తోంది. తెలంగాణలో పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యలతో అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ కస్టడీలో ఉండగా విచారణకు వెళితే..తేడాలు వస్తాయన్న భయంతోనే ఆయన ఇంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారని ఏసీబీ అనుమానిస్తోంది. ఏసీబీని ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించి చిరునామా, ఫోన్ నెంబరు మాత్రం చెప్పకపోవడం ఎత్తుగడలో భాగమేనని భావిస్తోంది. మరోవైపు ఇంతకాలం ఏపీలో చికిత్స తీసుకున్నానని సండ్ర చెప్పడం విడ్డూరంగా ఉందని టీఆర్ ఎస్ నాయకులు మండిపడుతున్నారు. చట్టం అంటే గౌరవం ఉన్నవాడు దాక్కోవాల్సిన అవసరం ఏంటని ధ్వజమెత్తుతున్నారు. ఈ కేసులో నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారన్న దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఎద్దేవా చేస్తున్నారు.
Advertisement