వెయ్యి మందిని తొలగించనున్న బీబీసీ

ప్ర‌పంచంలో మీడియా పేరు మొద‌టిగా చెప్పాల్సి వ‌స్తే బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్ (బీబీసీ) పేరునే చెబుతారు. అలాంటి బీబీసీ ఇపుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డి ఆర్థికంగా స‌త‌మ‌త‌మ‌వుతోంది. దీంతో పొదుపు చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టే ప‌నిని చేప‌ట్టింది. ప్ర‌పంచంలోనే మంచి పేరున్న ఈ మీడియా సంస్థ చెడ్డ పేరు రాకుండా ఎలా ముందుకెళ్ళాలా అని ఆలోచించి ఆలోచించి చివ‌ర‌కు త‌ప్ప‌ని ప‌రిస్థితిలో సిబ్బంది తొల‌గింపు ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగా మొద‌ట బీబీసీ వెయ్యిమందికిపైగా […]

Advertisement
Update:2015-07-02 18:50 IST
ప్ర‌పంచంలో మీడియా పేరు మొద‌టిగా చెప్పాల్సి వ‌స్తే బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్ (బీబీసీ) పేరునే చెబుతారు. అలాంటి బీబీసీ ఇపుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డి ఆర్థికంగా స‌త‌మ‌త‌మ‌వుతోంది. దీంతో పొదుపు చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టే ప‌నిని చేప‌ట్టింది. ప్ర‌పంచంలోనే మంచి పేరున్న ఈ మీడియా సంస్థ చెడ్డ పేరు రాకుండా ఎలా ముందుకెళ్ళాలా అని ఆలోచించి ఆలోచించి చివ‌ర‌కు త‌ప్ప‌ని ప‌రిస్థితిలో సిబ్బంది తొల‌గింపు ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగా మొద‌ట బీబీసీ వెయ్యిమందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. 15 కోట్ల పౌండ్ల లోటు బడ్జెట్‌తో సతమతమవుతున్న బీబీసీ సంస్థాగత వ్యయాన్ని తగ్గించుకునే చర్యలలో భాగంగా సిబ్బందికి ఉద్వాసన ప‌ల‌క‌డం ఇపుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతుంది.
Tags:    
Advertisement

Similar News