పబ్లిసిటీ లేకపోతే పరిహారం అందించరా?
ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం చెల్లించకపోవడపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రులు పబ్లిసిటీ కోసమే వచ్చి సాయం ప్రకటించారని, పబ్లిసిటీ వచ్చే కార్యక్రమం ఉంటే చంద్రబాబు అక్కడికి వెళ్లి సాయం అందిస్తారని జగన్ ఎద్దేవా చేశారు. 22 మంది మరణిస్తే ముఖ్యమంత్రి కనీసం వచ్చి పరామర్శించలేదని, ఆయన అన్నారు. విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా జగన్ శుక్రవారం విశాఖ […]
Advertisement
ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం చెల్లించకపోవడపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రులు పబ్లిసిటీ కోసమే వచ్చి సాయం ప్రకటించారని, పబ్లిసిటీ వచ్చే కార్యక్రమం ఉంటే చంద్రబాబు అక్కడికి వెళ్లి సాయం అందిస్తారని జగన్ ఎద్దేవా చేశారు. 22 మంది మరణిస్తే ముఖ్యమంత్రి కనీసం వచ్చి పరామర్శించలేదని, ఆయన అన్నారు. విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా జగన్ శుక్రవారం విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. ప్రమాదం జరిగి 18 రోజులవుతున్నా ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎందుకు మోసం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. 2 లక్షలు ప్రకటించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ కుటుంబాలకు సాయం అందకపోతే ఇక్కడే ధర్నా చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాను ఇక్కడకు రాబట్టి వీళ్లకు సాయం అందలేదన్న విషయం తెలిసిందని లేకపోతే వీళ్లని ఇలాలగేవదిలేసేవారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు సిగ్గులేదు
తమది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న పార్టీ అని, విభజనకు మొట్టమొదటగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలే ఓటేసి మద్దతు తెలిపారని జగన్ వివరించారు. చంద్రబాబుకు సిగ్గులేదు.. బుద్ధీలేదని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో రాజకీయంగా తాము ఏ పార్టీకి మద్దతిస్తే చంద్రబాబుకు ఎందుకని జగన్ ప్రశ్నించారు. రాజకీయం చేయడం కోసమే, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఏకంగా లంచాలు తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జగన్ అన్నారు. ”హత్య చేసిన వ్యక్తి పట్టుబడి ఆ హత్యను వీడియో తీయడం తప్పు అంటున్నారు… కానీ హత్య చేయడం తప్పు కాదంటున్నారు” అని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అనేవ్యక్తి మనిషి జన్మలో పు్ట్టిన రాక్షసుడు అని జగన్ విమర్శించారు.
Advertisement