అనాథలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
రాష్ట్రంలోని అనాథ బాల బాలికలకు ప్రత్యేక విద్యావిధానాన్ని చేపట్టాలని తెలంగాణలోని సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు వారికి అనుకూలించేలా విద్యా వసతులను కల్పించాలని, చదువు పూర్తయిన వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించాయి. స్త్రీ శిశు, దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల శాఖల ఉన్నతాధికారులు దేశవిదేశాల్లోని విధానాలను అధ్యయనం చేసి సర్కార్‌కు ఈ నివేదికను అందచేశారు. అనాథ పిల్లలకు ఇప్పుడున్న పాఠశాలలతో పాటు […]
Advertisement
రాష్ట్రంలోని అనాథ బాల బాలికలకు ప్రత్యేక విద్యావిధానాన్ని చేపట్టాలని తెలంగాణలోని సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు వారికి అనుకూలించేలా విద్యా వసతులను కల్పించాలని, చదువు పూర్తయిన వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించాయి. స్త్రీ శిశు, దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల శాఖల ఉన్నతాధికారులు దేశవిదేశాల్లోని విధానాలను అధ్యయనం చేసి సర్కార్‌కు ఈ నివేదికను అందచేశారు. అనాథ పిల్లలకు ఇప్పుడున్న పాఠశాలలతో పాటు ఒకటో తరగతి నుంచి వారి కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యాసంస్థల్లో బోధనా సిబ్బందితో పాటు మనస్తత్వ శాస్త్ర నిపుణులను నియమించాలని, చదువు పూర్తయిన వెంటనే వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి స్థిరపడేలా చేయాలని, అనాథ పిల్లలకు ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నివేదికలో సూచించారు.
Advertisement