రంగారెడ్డి జిల్లాలో ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర‌

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలకు అభయహస్తమిచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వై.ఎస్‌. షర్మిల. నాలుగు రోజుల యాత్రలో భాగంగా ఆమె చివరిరోజు గురువారం రంగారెడ్డి జిల్లాలోని మొమిన్‌పేటకు చేరుకుని అక్కడ అరిగే యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆలంపల్లి వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఎలాంటి కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. షర్మిల నాలుగు రోజుల యాత్రలో మొత్తం […]

Advertisement
Update:2015-07-01 18:50 IST
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలకు అభయహస్తమిచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వై.ఎస్‌. షర్మిల. నాలుగు రోజుల యాత్రలో భాగంగా ఆమె చివరిరోజు గురువారం రంగారెడ్డి జిల్లాలోని మొమిన్‌పేటకు చేరుకుని అక్కడ అరిగే యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆలంపల్లి వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఎలాంటి కష్టమొచ్చినా తాము అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. షర్మిల నాలుగు రోజుల యాత్రలో మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి 15 కుటుంబాలను ఓదార్చారు. వెళ్ళిన ప్రతిచోటా ఆమెకు అపూర్వ ఆదరణ లభించింది. షర్మిల కూడా ఆయా కుటుంబాలు కోల్పోయిన స్థైర్యాన్ని మళ్ళీ వారిలో కల్పిస్తూ ఏ కష్టమొచ్చినా తమ పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి అవసరమొచ్చినా తమ వద్దకు వచ్చి చెప్పుకోవచ్చని హామీ ఇచ్చారు. నాలుగు రోజులపాటు ఆమె 590 కిలోమీటర్ల మేర యాత్ర జరిపారు. జూన్‌ 29 నుంచి ఆమె రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా ఈ నెలాఖరులో తెలంగాణలోని మరో జిల్లాలో తాను పర్యటిస్తానని షర్మిల తెలిపారు.
Tags:    
Advertisement

Similar News