బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్‌లోకి: డీఎస్
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళుతున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను ఏ పదవీ ఆశించి టీఆర్ఎస్‌లోకి వెళ్ళడం లేదని చెబుతూ పదవులు శాశ్వతం కాదని అన్నారు. ఆత్మ గౌరవానికి మించిన పదవి లేదని, తనను మానసికంగా చాలా వేధించారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రాసనం వేసి తనను అవమానించిన సందర్భాలను మరిచిపోలేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చింది […]
Advertisement
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళుతున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను ఏ పదవీ ఆశించి టీఆర్ఎస్‌లోకి వెళ్ళడం లేదని చెబుతూ పదవులు శాశ్వతం కాదని అన్నారు. ఆత్మ గౌరవానికి మించిన పదవి లేదని, తనను మానసికంగా చాలా వేధించారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రాసనం వేసి తనను అవమానించిన సందర్భాలను మరిచిపోలేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియానే అని, ఆమె పట్ల ఇప్పటికీ అచంచెల గౌరవం ఉందని డీఎస్ అన్నారు. తెలంగాణ తెచ్చింది మాత్రం కేసీఆరేనని డీఎస్ చెబుతూ బంగారు తెలంగాణ సాధన కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని, తాను కూడా ఈ యజ్ఞంలో భాగస్వామి కావాలన్న సంకల్పంతోనే టీఆర్ఎస్‌లోకి వెళుతున్నానని డి. శ్రీనివాస్ చెప్పారు. కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను బాగా అమలు చేస్తున్నారని, ఆయన చాలా కమిట్‌మెంట్‌తో పని చేస్తున్నారని డి.శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్సీ సీటు ఓ మహిళకు ఇస్తున్నామని దిగ్విజయ్‌సింగ్ తనకు చెప్పాననడం శుద్ధ అబద్దమని, ఎమ్మెల్సీ పదవి తనకు ఇవ్వనందుకే పార్టీ మారుతున్నానన్నది కూడా నిజం కాదని ఆయన అన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను ఏనాడూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయలేదని, ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు అనేక మంది నాయకులతో తనకు మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం తాను ఆర్రులు చాచలేదని, పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవులు నిర్వహించానని, కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ మారుతున్నాననడం కొంతమంది నాయకుల అవివేకమని డిఎస్ ఆరోపించారు. తన కమిట్‌మెంట్‌పై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, నీతులు చెప్పేవారు తమ రీతులను ఒకసారి గుర్తు చేసుకోవాలని పరోక్షంగా దిగ్విజయ్‌ని ఉద్దేశించి డిఎస్ వ్యాఖ్యానించారు. అబద్దాల కోరుగా మారిన దిగ్విజయ్‌పై తనకున్న గౌరవం పోయిందని డిఎస్ అన్నారు. తనకు ఎన్నో పదవులు ఇచ్చామనడం నిజమే కావచ్చు… తాను పార్టీకి అంతకన్నా ఎక్కువ సేవ చేశానని గుర్తు చేశారు. తన రాజీనామాకు కారణాలు ఇవేమీ కాదని, ఇలా బాధాతప్త హృదయంతో రాజీనామా చేయాల్సి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని ఆయన అన్నారు. తన జీవితంలో చాలా బాధాకరమైనదిగా ఈరోజును పరిగణిస్తానని డీఎస్ అన్నారు.
Advertisement