చిన్నారుల‌తో అల్లు అర్జున్ ఆటాపాటా 

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో రేసుగుర్రంలా వ‌రుస హిట్ల‌తో దూసుకెళుతున్న అల్లు అర్జున్ వివిధ రోగాల‌కు గురైన‌ చిన్నారుల‌తో క‌లిసి న‌గ‌రంలో సంద‌డి చేశారు. ఆటాపాట‌ల‌తో వారిని అల‌రించారు. ముద్దు ముద్దు మాట‌ల‌తో మూటలు క‌డుతున్న చిన్నారుల‌కు సైకిళ్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి వారి క‌ళ్ల‌ల్లో ఆనందాన్ని నింపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మేక్ ఏ విష్ అనే  స్వ‌చ్ఛంద సంస్థ  అభ్య‌ర్థ‌న మేర‌కు మ‌ధుమేహం, త‌ల‌సీమియా వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నచిన్నారుల‌తో అల్లు అర్జున్ స‌ర‌దాగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా అల్లు […]

Advertisement
Update:2015-07-01 18:40 IST
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో రేసుగుర్రంలా వ‌రుస హిట్ల‌తో దూసుకెళుతున్న అల్లు అర్జున్ వివిధ రోగాల‌కు గురైన‌ చిన్నారుల‌తో క‌లిసి న‌గ‌రంలో సంద‌డి చేశారు. ఆటాపాట‌ల‌తో వారిని అల‌రించారు. ముద్దు ముద్దు మాట‌ల‌తో మూటలు క‌డుతున్న చిన్నారుల‌కు సైకిళ్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి వారి క‌ళ్ల‌ల్లో ఆనందాన్ని నింపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మేక్ ఏ విష్ అనే స్వ‌చ్ఛంద సంస్థ అభ్య‌ర్థ‌న మేర‌కు మ‌ధుమేహం, త‌ల‌సీమియా వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నచిన్నారుల‌తో అల్లు అర్జున్ స‌ర‌దాగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా అల్లు మాట్లాడుతూ చిన్న వ‌య‌సులోనే పెద్ద జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు సెల‌బ్రెటీలు అండ‌గా నిల‌వాల‌ని, వారి చిన్న చిన్న కోర్కెల‌ను తీరుస్తూ మ‌నోధైర్యాన్ని నింపాల‌ని అన్నారు. బాధిత చిన్నారుల కోర్కెల‌ను తీర్చ‌డంలో మేక్ ఏ విష్ ఫౌండేష‌న్ చేస్తున్న కృషి అభినందించారు.
Tags:    
Advertisement

Similar News