వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్ళెం!
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా వాహనాలకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర వాహన చట్టంలోని నిబంధనలు మార్పు చేస్తూ బస్సులు, లారీల వంటి భారీ వాహనాల వేగాన్ని పరిమితం చేసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను తెలుగు రాష్ట్రాలకు, రవాణా శాఖలకు పంపింది. ఈ నిబంధనలు కొత్త వాహనాలకు ఈ యేడాది అక్టోబరు 1 నుంచి వర్తిస్తాయి. పాత వాహనాలకు మాత్రం 2016 ఏప్రిల్ 1 వరకూ అవకాశం కల్పించింది. వేగ నియంత్రణ నుంచి వ్యక్తిగత […]
Advertisement
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా వాహనాలకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర వాహన చట్టంలోని నిబంధనలు మార్పు చేస్తూ బస్సులు, లారీల వంటి భారీ వాహనాల వేగాన్ని పరిమితం చేసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను తెలుగు రాష్ట్రాలకు, రవాణా శాఖలకు పంపింది. ఈ నిబంధనలు కొత్త వాహనాలకు ఈ యేడాది అక్టోబరు 1 నుంచి వర్తిస్తాయి. పాత వాహనాలకు మాత్రం 2016 ఏప్రిల్ 1 వరకూ అవకాశం కల్పించింది. వేగ నియంత్రణ నుంచి వ్యక్తిగత వాహనాలకు కేంద్రం మినహాయింపునిచ్చింది. ద్విచక్ర, త్రిచక్ర, 3,500 కేజీల్లోపు బరువున్న నాలుగు చక్రాల వ్యక్తిగత వాహనాలు, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు, అగ్నిమాపక శకటాలకు కూడా మినహాయింపునిచ్చింది. లారీలు, ప్రయివేటు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులకు గరిష్ట వేగాన్ని 80 కిలో మీటర్లకు పరిమితం చేసింది. స్కూలు బస్సులకు, డంపర్లు, పెట్రోలు, డీజిల్ వంటి రసాయనాలు తీసుకెళ్లే ట్యాంకర్లను 60 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేసింది. కొత్త వాహనాల తయారీ సంస్థలు వేగ నిరోధక పరికరాన్ని ఏర్పాటు చేయాలని, పాత వాహనాలకు ఎవరికి వారు ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మినహాయింపు ఇచ్చిన వాహనాలకు మినహా అన్ని రకాల కొత్త రవాణా వాహనాలకు 1 అక్టోబరు, 2015 నుంచి స్పీడ్ గవర్నర్ ఉండాలని, అక్టోబరు 1లోపు రిజిస్టరైన వాహనాలు అన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాలు అక్టోబరు 1లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆ ఉత్తర్వులో కేంద్రం ఆదేశించింది. పాత వాహనాల అన్నింటికి దశల వారీగా 1 ఏప్రిల్ 2016 లోపు స్పీడ్ గవర్నర్లను బిగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
Advertisement