ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌కు పెరూ అత్యున్నత పురస్కారం
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ను పెరూ దేశం అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. పెరూలోని మూడు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను ఆయనకు అందచేసింది. నిరంతరం ఆయన చేస్తున్న సామాజిక సేవకు, శాంతి కార్యక్రమాలకు పెరూ నేషనల్ కాంగ్రెస్ డిప్లొమో డి ఆనర్‌ను ప్రదానం చేసింది. ది యాండియన్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారమైన మెడెల్లా డి లా ఇంటిగ్రేషన్ ఎన్ ఎల్ గ్రాడో, డి గ్రాన్ అఫిషియల్ ను ప్రదానం చేసింది. ఈ పురస్కారం అందుకున్న […]
Advertisement
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ను పెరూ దేశం అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. పెరూలోని మూడు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను ఆయనకు అందచేసింది. నిరంతరం ఆయన చేస్తున్న సామాజిక సేవకు, శాంతి కార్యక్రమాలకు పెరూ నేషనల్ కాంగ్రెస్ డిప్లొమో డి ఆనర్‌ను ప్రదానం చేసింది. ది యాండియన్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారమైన మెడెల్లా డి లా ఇంటిగ్రేషన్ ఎన్ ఎల్ గ్రాడో, డి గ్రాన్ అఫిషియల్ ను ప్రదానం చేసింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు రవిశంకరే కావడం విశేషం.
Advertisement