ఆర్ బీఐకు టీ.సర్కార్ నోటీసులు
ఐటీ శాఖకు ఏపీ బేవరేజెస్ చెల్లించాల్సిన ఆదాయపు పన్నును రిజర్వ్ బ్యాంక్ టీ. ప్రభుత్వ ఖాతా నుంచి ఐటీ శాఖకు తరలించడాన్ని టీ.సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీ శాఖకు తరలించిన రూ. 1,274 కోట్లను తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆర్‌బీఐకు నోటీసులు జారీ చేసింది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా రాష్ట్ర ఖాతాలోని సొమ్మును ఎలా జప్తు చేస్తారని ఆర్‌బీఐని టీ. సర్కార్ ప్రశ్నించింది. మరుసటి […]
ఐటీ శాఖకు ఏపీ బేవరేజెస్ చెల్లించాల్సిన ఆదాయపు పన్నును రిజర్వ్ బ్యాంక్ టీ. ప్రభుత్వ ఖాతా నుంచి ఐటీ శాఖకు తరలించడాన్ని టీ.సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీ శాఖకు తరలించిన రూ. 1,274 కోట్లను తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆర్‌బీఐకు నోటీసులు జారీ చేసింది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా రాష్ట్ర ఖాతాలోని సొమ్మును ఎలా జప్తు చేస్తారని ఆర్‌బీఐని టీ. సర్కార్ ప్రశ్నించింది. మరుసటి రోజు ఉదయం లావాదేవీల స్టేట్‌మెంట్ చూసే వరకు తమ ఖాతాలో నుంచి ఐటీ శాఖకు నిధులు జమ అయినట్లు తెలియలేదని పేర్కొంది. బ్యాంకులో ఉన్న మా నిధులకు భద్రత లేదా? ఇదే తరహాలో ఎవరొచ్చినా, ఎవరు అడిగినా మా ఖాతా నిధులను వారికి మళ్లిస్తారా, కనీసం మాటమాత్రంగా కూడా సమాచారం ఇవ్వకుండా ఐటీ శాఖకు నిధులెలా మళ్లించారని ప్రశ్నించింది. జప్తు చేసిన నిధులను తిరిగి తమ ఖాతాలో జమ చేయాలని ఆర్‌బీఐని టీ. సర్కార్ కోరింది.