ఆంధ్రులకూ హైదరాబాద్ పై సమాన హక్కులు
తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఈ నగరంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత హక్కు ఉందో అంతే సమానంగా ఆంధ్రా ప్రజలకూ హక్కులున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ఇచ్చిన హక్కుతో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉంచే శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. మంగళవారం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తొందర తొందరగా ఏదో ఒక తాత్కాలిక […]
తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఈ నగరంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత హక్కు ఉందో అంతే సమానంగా ఆంధ్రా ప్రజలకూ హక్కులున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ఇచ్చిన హక్కుతో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉంచే శాఖాపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. మంగళవారం ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తొందర తొందరగా ఏదో ఒక తాత్కాలిక కార్యలయాలను విజయవాడలో ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిన అవసరం లేదని, పదేళ్ల వరకూ హైదరాబాద్‌లో శాఖాపరమైన కార్యకలపాలు కొనసాగించే అధికారం ఉంది కనుక నిదానంగా నూతన రాజధానిలో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అన్నారు.