రేవంత్ బెయిల్‌పై సుప్రీంకు
ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ నిర్ణయించింది. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంపై సీరియస్ గా వ్యవహరించాలని ఏసీబీ భావిస్తోంది. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే దానిని క్షుణ్ణంగా పరిశీలించి రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కు రేవంత్ […]
ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ నిర్ణయించింది. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంపై సీరియస్ గా వ్యవహరించాలని ఏసీబీ భావిస్తోంది. హైకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే దానిని క్షుణ్ణంగా పరిశీలించి రేవంత్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కు రేవంత్ ఇవ్వచూపిన రూ.50 లక్షలతో పాటు ఇంకా ఇస్తానని చెప్పిన రూ.4.5 కోట్లు అతడికి ఎక్కడ నుంచి వచ్చాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని ఏసీబీ సుప్రీంకోర్టుకు వివరించనుంది. ఈకేసులో నాలుగో నిందితుడు మత్తయ్యను కూడా విచారించాల్సి ఉన్నందున రేవంత్‌కు బెయిల్ రద్దు చేయమని ఏసీబీ అధికారులు సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.