జాబులెక్కడ బాబూ..?
బాబు వస్తే జాబు వస్తుందంటూ టిడిపి నాయకులు ఎన్నికల్లో ఊదరగొట్టారని, ఏడాది దాటినా ఇంతవరకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ‘బాబు వస్తే జాబు’ పేరిట ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన టిడిపి, తదనంతరం హామీల అమలుకు పూనుకోలేదని విమర్శించారు. ‘బాబొచ్చాడు-జాబు రాలేదు’, ‘నిరుద్యోగభృతి ఇవ్వాలి’, […]
Advertisement
బాబు వస్తే జాబు వస్తుందంటూ టిడిపి నాయకులు ఎన్నికల్లో ఊదరగొట్టారని, ఏడాది దాటినా ఇంతవరకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ‘బాబు వస్తే జాబు’ పేరిట ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన టిడిపి, తదనంతరం హామీల అమలుకు పూనుకోలేదని విమర్శించారు. ‘బాబొచ్చాడు-జాబు రాలేదు’, ‘నిరుద్యోగభృతి ఇవ్వాలి’, ‘కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల ప్రభుత్వ పోస్టులు భాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పునరుద్ధరించని ఫలితంగా గ్రూప్ 1, 2 వంటి 25 వేల పోస్టులు భర్తీ కావట్లేదు. అలాగే గ్రూప్ 4, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూపు -1, గ్రూపు -2 ఉద్యోగ నియామకాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 2600 కార్యదర్శుల పోస్టులను, పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఉన్న జాబులు కూడా ఊడగొడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తమకు ఉద్యోగాలైనా కల్పించాలి లేదా భృతైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్న నిరుద్యోగులు హెచ్చరించారు.
Advertisement