బీపీని అదుపులో ఉంచుకోండిలా....

గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్న, తక్కువగా కొట్టుకున్నా ప్ర‌మాద‌మే. అదే గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు. గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్ ప్రెష‌ర్ (బీపీ) అంటారు . బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయం కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. చిన్న చిన్న మార్పుల ద్వారా బీపీని […]

Advertisement
Update:2015-06-30 01:31 IST

గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్న, తక్కువగా కొట్టుకున్నా ప్ర‌మాద‌మే. అదే గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు. గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్ ప్రెష‌ర్ (బీపీ) అంటారు . బ్లడ్ ప్రెషర్ వచ్చాక నయం కావడమన్నది ఉండదు . కాని జీవనవిధానంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా రాకుండా జాగ్రత్తపడొచ్చు. చిన్న చిన్న మార్పుల ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవ‌చ్చు.

  • ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడ‌కూడ‌దు.
  • ప్రాసెస్డ్ , ప్యాకేజ్డ్ ప‌దార్థాలు, ఫాస్ట్ పుడ్స్, క్యాన్డ్ పధార్థాలు తినడం బాగా తగ్గించాలి. ఎందుకంటే వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ బిపిని పెంచేస్తుంది.
  • కొవ్వు ప‌దార్థాల వ‌ల్ల‌ కొలెస్టిరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు. వీటి వాడ‌కం తగ్గించాలి. పచ్చళ్ళు, ఆవకాయ, ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి.
  • ఎక్కువ పీచు పదార్ధం ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయగూరలు, ఆకు కూరలు, పప్పులు తినాలి.
  • ఆల్కహాల్ మానివేయాలి . . . లేదా పరిమితులు ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువ కేలరీలు ఉన్న పానీయం.
  • పొగ త్రాగ‌డం మానేయాలి. సిగ‌రెట్ల‌లోని నికొటిన్ రక్తనాళాల పై ప్రబావం చూపిస్తుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి.
  • బీన్స్, బఠాణీలు, నట్స్ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నీరులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
Tags:    
Advertisement

Similar News