జూలై 1న పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల బంద్‌కు వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ నాయ‌కులు పిలుపునిచ్చారు. విద్యారంగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పాఠ‌శాల‌ల బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్లు వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అందిస్తామ‌న్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేయ‌డం లేద‌ని వారు విమ‌ర్శించారు. విద్యారంగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అనేక సంద‌ర్భాల్లో విన‌తి ప‌త్రాలు ఇచ్చినా స్పంద‌న లేద‌ని […]

Advertisement
Update:2015-06-28 18:51 IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల బంద్‌కు వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ నాయ‌కులు పిలుపునిచ్చారు. విద్యారంగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పాఠ‌శాల‌ల బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్లు వామ‌ప‌క్ష విద్యార్థి సంఘాల నేత‌లు ప్ర‌క‌టించారు. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అందిస్తామ‌న్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేయ‌డం లేద‌ని వారు విమ‌ర్శించారు. విద్యారంగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అనేక సంద‌ర్భాల్లో విన‌తి ప‌త్రాలు ఇచ్చినా స్పంద‌న లేద‌ని వారు ఆరోపించారు. కార్పోరేట్, ప్రైవేట్ విద్యాసంస్థ‌ల్లో ఫీజు నియంత్ర‌ణ‌కు చ‌ట్టం చేయాల‌ని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, ప్ర‌భుత్వ సిల‌బ‌స్‌ను ప్రైవేట్ విద్యాసంస్థ‌ల్లో బోధించాల‌ని వారు డిమాండ్ చేశారు.
జూనియ‌ర్ క‌ళాశాల‌లు
ఇంట‌ర్ బోర్డును ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కోరుతూ జూలై 1న జూనియ‌ర్ క‌ళాశాల‌ల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. కార్పోరేట్ విద్యా వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని, ఫీజుల నియంత్ర‌ణ చ‌ట్టం చేసి అన్ని క‌ళాశాల‌ల్లో ఒకే ర‌క‌మైన ఫీజు విధానాన్ని అమ‌లు చేయాల‌ని, ఒక పేరుతో ఒక కాలేజ్ మాత్ర‌మే కొన‌సాగించాల‌ని, ఖాళీగా ఉన్న జూనియ‌ర్ కాలేజ్ లెక్చ‌ర‌ర్ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌నే త‌దిత‌ర‌ డిమాండ్ల‌ను సాధించుకునేందుకు బంద్ నిర్వ‌హించ‌నున‌న‌ట్లు ఏబీవీపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు.

Tags:    
Advertisement

Similar News