పెళ్లి చెడగొట్టిన ప్రియుడు.. ఎదురుదాడిలో తల్లి మృతి
నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఎల్మగూడెంలో ఓ పెళ్ళి ఆగిపోయిన సంఘటనలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఒకరి చావుకు కారణమైంది. కాసేపటిలో వివాహం జరగాల్సి ఉండగా, గణేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తానూ, పెళ్ళికి సిద్ధం చేసిన వధువు ప్రేమించుకున్నామంటూ కలకలం సృష్టించాడు. దీంతో మగపెళ్లి వారు వెనక్కి తగ్గడంతో ఆ యువతి పెళ్ళి ఆగిపోయింది. ఆగ్రహించిన వధువు తరఫు బంధువులు గణేష్, అతని తల్లిదండ్రులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన గణేష్ […]
Advertisement
నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఎల్మగూడెంలో ఓ పెళ్ళి ఆగిపోయిన సంఘటనలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఒకరి చావుకు కారణమైంది. కాసేపటిలో వివాహం జరగాల్సి ఉండగా, గణేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తానూ, పెళ్ళికి సిద్ధం చేసిన వధువు ప్రేమించుకున్నామంటూ కలకలం సృష్టించాడు. దీంతో మగపెళ్లి వారు వెనక్కి తగ్గడంతో ఆ యువతి పెళ్ళి ఆగిపోయింది. ఆగ్రహించిన వధువు తరఫు బంధువులు గణేష్, అతని తల్లిదండ్రులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన గణేష్ తల్లి మరణించింది. గణేష్, అతని తండ్రి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement