త్వ‌ర‌లో క్యాబ్‌ల‌కూ మీట‌ర్లు

ప్ర‌యాణీకుల వ‌ద్ద నుంచి ట్రిప్ టైం చార్జీ పేరుతో దోపిడీ చేస్తున్న ట్యాక్సీ నిర్వాహ‌కులకు క‌ళ్లెం వేయాల‌ని ర‌వాణా శాఖ నిర్ణ‌యించింది. ఆటోల త‌ర‌హాలో క్యాబ్ ల ధ‌ర‌ల‌ను కూడా  నియంత్రించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. అందుకోసం క్యాబ్ లకూ మీట‌ర్లను ఏర్పాటు చేయాలంటూ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపారు. మొన్న‌టి వ‌ర‌కూ కిలోమీట‌రుకు ఇంత చొప్పున  ఎన్ని కిలో మీట‌ర్లు ప్ర‌యాణిస్తే  అంత చార్జీల‌ను  ప్ర‌యాణీకుల వ‌ద్ద నుంచి క్యాబ్ నిర్వాహ‌కులు వ‌సూలు చేసేవారు. అయితే, ఇటీవ‌ల కొద్ద […]

Advertisement
Update:2015-06-28 18:46 IST

ప్ర‌యాణీకుల వ‌ద్ద నుంచి ట్రిప్ టైం చార్జీ పేరుతో దోపిడీ చేస్తున్న ట్యాక్సీ నిర్వాహ‌కులకు క‌ళ్లెం వేయాల‌ని ర‌వాణా శాఖ నిర్ణ‌యించింది. ఆటోల త‌ర‌హాలో క్యాబ్ ల ధ‌ర‌ల‌ను కూడా నియంత్రించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. అందుకోసం క్యాబ్ లకూ మీట‌ర్లను ఏర్పాటు చేయాలంటూ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపారు. మొన్న‌టి వ‌ర‌కూ కిలోమీట‌రుకు ఇంత చొప్పున ఎన్ని కిలో మీట‌ర్లు ప్ర‌యాణిస్తే అంత చార్జీల‌ను ప్ర‌యాణీకుల వ‌ద్ద నుంచి క్యాబ్ నిర్వాహ‌కులు వ‌సూలు చేసేవారు. అయితే, ఇటీవ‌ల కొద్ద కాలం నుంచి చార్జీతో పాటు ప్ర‌యాణించిన ప్ర‌తి నిమిషానికీ రూ.1.25 చొప్పున అద‌నంగా వ‌సూలు చేస్తున్నారు. ట్రిప్ టైం చార్జీ పేరుతో వీరు చేస్తున్న దోపిడీకి ప్ర‌యాణీకులు నిండా మునిగి పోతున్నారు. ప్ర‌భుత్వ అజ‌మాయిషీ కూడా లేక పోవ‌డంతో వీరు చెల‌రేగి పోయారు. క్యాబ్‌ల దోపిడీపై ర‌వాణా శాఖ‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో చ‌ర్య‌లు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇక‌పై క్యాబ్‌ల‌కు నిర్థారిత రంగుతో పాటు, కారు పైన ట్యాక్సీ అన్న బోర్డు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని తెలంగాణ రాష్ట్ర ర‌వాణా శాఖ భావిస్తోంది. తెలుపు రంగుపై గులాబీ చార‌లుండేలా తాత్కాలిక ఫార్మాట్ ను అధికారులు రూపొందించారు. ప్ర‌భుత్వం క‌నుక ఈ ఫార్మాట్‌ను అంగీక‌రిస్తే ఇక క్యాబ్ లు అన్నీ ఒకే రంగులో క‌నిపించ‌నున్నాయి.

Tags:    
Advertisement

Similar News