భారతీయ రైల్వేకి ‘గగన్’ దన్ను
భారతీయ రైల్వేకి అవసరమయ్యే నేవిగేషనల్ సపోర్ట్‌ను అందించేందుకు గగన్ సేవలను ఉపయోగించుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, పర్వత ప్రాంతాలలోని మార్గాలు, టన్నెల్‌ల గుండా ప్రయాణించే సమయాల్లో భద్రతాపరమైన ఏర్పాట్ల విషయంలో గగన్ సిస్టం తోడ్పడుతుందని ఇస్రో చైర్మన్ ఏ.ఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. దీంతో ట్రాక్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ స్పేస్ టెక్నాలజీ ద్వారా అందుకోవచ్చన్నారు. విమానాల ల్యాండింగ్‌కు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని అందించే ఉద్దేశంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ […]
Advertisement
భారతీయ రైల్వేకి అవసరమయ్యే నేవిగేషనల్ సపోర్ట్‌ను అందించేందుకు గగన్ సేవలను ఉపయోగించుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, పర్వత ప్రాంతాలలోని మార్గాలు, టన్నెల్‌ల గుండా ప్రయాణించే సమయాల్లో భద్రతాపరమైన ఏర్పాట్ల విషయంలో గగన్ సిస్టం తోడ్పడుతుందని ఇస్రో చైర్మన్ ఏ.ఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. దీంతో ట్రాక్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ స్పేస్ టెక్నాలజీ ద్వారా అందుకోవచ్చన్నారు. విమానాల ల్యాండింగ్‌కు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని అందించే ఉద్దేశంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), ఇస్రో సంయుక్తంగా గగన్‌ను రూపొందించాయి. దీని సంకేతాలను జియోస్టేషనల్ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ) ఉపగ్రహాలు జీ శాట్- 8, జీశాట్-10 గ్రహించి భూమిపైకి చేరవేస్తాయని వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కాపలా లేని క్రాసింగ్‌లను ముందుగా గమనించి, హెచ్చరించే వీలు కలుగుతుంది.
Advertisement