ఏపీ పెన్షనర్లకూ పెరిగిన పీఆర్సీ అమలు
ఏపీ పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 3.5 లక్షల మంది పెన్షనర్లకు పెరిగిన పీఆర్‌సీ ఇవ్వనుంది. ఏప్రిల్, మే, జూన్ బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత బిల్లులు తయారు చేసి ట్రెజరీలకు పంపాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులకు కూడా శుభవార్త అందించింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. పదవీ విరమణ వయస్సు […]
Advertisement
ఏపీ పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 3.5 లక్షల మంది పెన్షనర్లకు పెరిగిన పీఆర్‌సీ ఇవ్వనుంది. ఏప్రిల్, మే, జూన్ బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత బిల్లులు తయారు చేసి ట్రెజరీలకు పంపాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులకు కూడా శుభవార్త అందించింది. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. పదవీ విరమణ వయస్సు మరో 2 ఏళ్లు పెరగడంపట్ల ఏపీ పట్టణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement