రాజధాని వైన్స్
ఏపీ రాజధానికి లిక్కర్ కిక్ ఇచ్చింది. అమరావతి పేరు ప్రకటించి ఏపీకి అసలైన బ్రాండ్ అమరావతేనని బాబు ప్రకటించారు. అదే అమరావతి ఉన్న జిల్లా ఇప్పుడు ఏపీకి బ్రాందీ అంబాసిడర్‌గా మారింది. ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతమంతా గుంటూరు జిల్లాలోనే ఉంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో 342 షాపులున్నాయి. వీటిలో 303 షాపులకు 11,548 దరఖాస్తులొచ్చాయి. గతంలో గుంటూరు జిల్లా మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులు ఇందులో సగం కూడా […]
Advertisement
ఏపీ రాజధానికి లిక్కర్ కిక్ ఇచ్చింది. అమరావతి పేరు ప్రకటించి ఏపీకి అసలైన బ్రాండ్ అమరావతేనని బాబు ప్రకటించారు. అదే అమరావతి ఉన్న జిల్లా ఇప్పుడు ఏపీకి బ్రాందీ అంబాసిడర్‌గా మారింది. ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతమంతా గుంటూరు జిల్లాలోనే ఉంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో 342 షాపులున్నాయి. వీటిలో 303 షాపులకు 11,548 దరఖాస్తులొచ్చాయి. గతంలో గుంటూరు జిల్లా మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులు ఇందులో సగం కూడా లేవు. అత్యధికంగా నడికుడి దుకాణానికి 354 దరఖాస్తులొచ్చాయి. ఇక నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద ప్రభుత్వ ఖజానాకు ఒక్క రోజులో 35 కోట్ల రూపాయలు జమైంది. ఖాళీ అయిన క్వార్టర్ బాటిల్‌లా మారిన ఆంధ్రప్రదేశ్ ఖజానా మద్యం ఇచ్చే రెవెన్యూ కిక్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఆ రెవెన్యూ ఏ రేంజ్‌లో వస్తుందో తెలియదు కానీ..రాజధాని పరిధిలో మద్యం దుకాణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాజధాని వైన్స్..అదుర్స్ అన్న మాట.
Advertisement