ఈ- టికెట్‌కు ఆధార్ తప్పనిసరి
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే రైల్వే ఈ-టికెట్‌కు ఇకపై ఆధార్ నెంబరును తప్పనిసరి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అందుకోసం భారీ కసరత్తు చేస్తోంది. కొత్త విధానం ద్వారా ఈ-టికెట్లు బ్లాక్ మార్కెటింగ్ బారిన పడకుండా ఉంటాయని రైల్వే బోర్డు భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మార్గాలను అన్వేషించాలని భారత రైల్వే కేటరింగ్, టూరిజం కార్పోరేషన్‌ను ఆదేశించింది. ఆన్‌లైన్ వినియోగదారుడు తన యూజర్ ఐడీ వివరాలను నమోదు చేశాక ఆధార్ సంఖ్యను అడిగేలా చేయాలని, ఐఆర్‌సీటీసీ […]
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే రైల్వే ఈ-టికెట్‌కు ఇకపై ఆధార్ నెంబరును తప్పనిసరి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అందుకోసం భారీ కసరత్తు చేస్తోంది. కొత్త విధానం ద్వారా ఈ-టికెట్లు బ్లాక్ మార్కెటింగ్ బారిన పడకుండా ఉంటాయని రైల్వే బోర్డు భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మార్గాలను అన్వేషించాలని భారత రైల్వే కేటరింగ్, టూరిజం కార్పోరేషన్‌ను ఆదేశించింది. ఆన్‌లైన్ వినియోగదారుడు తన యూజర్ ఐడీ వివరాలను నమోదు చేశాక ఆధార్ సంఖ్యను అడిగేలా చేయాలని, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వినియోగదారుడు సమర్పించే గుర్తింపు వివరాలను, ఆధార్ కార్డు కోసం యూఐడీఏఐకు ఇచ్చిన వివరాలతో పోల్చి చూసి, అవి రెండూ సరిపోయిన తర్వాతే ఈ టికెట్ కోసం వినియోగదారుడికి పాస్‌వర్డ్ అందేలా చూడాలని రైల్వే శాఖ చర్యలు చేపట్టనుంది.