సోమవారం సండ్ర విచారణా..? అరెస్టా?
ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విచారణకు హాజరవుతారా..? మరోమారు సడలింపు అడుగుతారా..? సోమవారంతో గడువు ముగుస్తున్నందున ఏం జరగబోతోంది? ఒకవేళ విచారణకు హాజరైతే ఆయనను వేం నరేందర్ రెడ్డిలాగా ప్రశ్నించి వదిలేస్తారా లేక అరెస్టు చేస్తారా..? ఇవన్నీ తేలాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే. సండ్ర విషయంలో ఏసీబీ ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై చంద్రబాబు విషయంలోనూ ఏసీబీ అడుగులు ఎలా ఉంటాయనేది తేలిపోతుంది. అందుకని సోమవారం ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా […]
Advertisement
ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విచారణకు హాజరవుతారా..? మరోమారు సడలింపు అడుగుతారా..? సోమవారంతో గడువు ముగుస్తున్నందున ఏం జరగబోతోంది? ఒకవేళ విచారణకు హాజరైతే ఆయనను వేం నరేందర్ రెడ్డిలాగా ప్రశ్నించి వదిలేస్తారా లేక అరెస్టు చేస్తారా..? ఇవన్నీ తేలాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే. సండ్ర విషయంలో ఏసీబీ ఎలా వ్యవహరిస్తుంది అనే దానిపై చంద్రబాబు విషయంలోనూ ఏసీబీ అడుగులు ఎలా ఉంటాయనేది తేలిపోతుంది. అందుకని సోమవారం ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రేవంత్‌రెడ్డి పట్టుబడ్డ తర్వాత ఏసీబీ అధికారులు మొదటగా కేవలం సండ్రకు మాత్రమే సీఆర్‌పీసీ 160 ప్రకారం ఈ నెల 16న ఆయనకు తాఖీదులిచ్చారు. ఈ కేసులో తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని ఏసీబీ కోరింది. అయితే సండ్ర విచారణకు హాజరుకాకుండా 19వ తేదీన టీడీపీ కార్యదర్శితో ఏసీబీ దర్యాప్తు అధికారి పేరుమీద లేఖ పంపించారు. తాను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యులు పదిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. ఈ నెపంతో వెంకటవీరయ్య ఏసీబీ ఎదుట హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సండ్ర కోరిన ప్రకారంగానైనా పదిరోజుల గడువు సోమవారంతో ముగియనుండటంతో టీడీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. సోమవారం విచారణకు హాజరు కాకపోతే సండ్రను అరెస్టు చేసే అవకాశముంది. ఏసీబీ ఎదుట విచారణకు ఆయన హాజరవుతారా? లేక అనారోగ్య కారణాలు చెప్పి ఇంకా తప్పించుకు తిరుగుతారా? అని ఏసీబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వెంకటవీరయ్య అనారోగ్యం పేరుతో పదిరోజుల వెసులుబాటు సంపాదించగా ఇదే కేసులో ఆరోపణలెదుర్కొంటున్న టీడీపీ నాయకుడు వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ ఒక్కరోజు విచారించింది. నోటీసులిచ్చినప్పుడు విచారణకు హాజరై ఉంటే నరేందర్‌రెడ్డిలాగే విచారించి వదిలేసేదని, విచారణను తప్పించుకోవడం వల్ల ఇపుడు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం నాయకులు మధనపడుతున్నారు.
Advertisement