గంగా హారతి తరహాలో గోదావరికీ హారతి
కాశీలోని గంగా నదికి ఇచ్చే హారతి తరహాలోనే గోదావరి నదికి కూడా ప్రతి రోజూ హారతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని జూలై 1వ తేదీ నుంచి అధికారికంగా ఆరంభించనుంది. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా నిత్యం ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. హారతి ప్రారంభ కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన పనులు జూలై 5వ తేదీ […]
కాశీలోని గంగా నదికి ఇచ్చే హారతి తరహాలోనే గోదావరి నదికి కూడా ప్రతి రోజూ హారతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని జూలై 1వ తేదీ నుంచి అధికారికంగా ఆరంభించనుంది. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా నిత్యం ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. హారతి ప్రారంభ కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. పుష్కరాలకు సంబంధించిన పనులు జూలై 5వ తేదీ లోగా పూర్తవుతాయని, వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో పాటు మొత్తం పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.1,650 కోట్లు ఖర్చుపెడుతోందని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో 151, పశ్చిమ గోదావరిలో 89 ఘాట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. పుష్కరాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని వారితో పాటు ఎంపీలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకూ ఆహ్వానపత్రాలు పంపుతున్నట్లు ఆయన చెప్పారు. పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన పూజ కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని మంత్రి చెప్పారు.