ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ తెలుగు మహిళా నేత
ఎర్రచందనం దుంగలను తరలిస్తూ టీడీపీ మహిళా నేత పోలీసులకు పట్టుబడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు ఏకుల రాజేశ్వరి తన స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో బద్వేలు వైపు బయలు దేరారు. ఓ మహిళ ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అట్లూరు పోలీసులు అప్రమత్తమై కడప-బద్వేలు మార్గం మధ్యలో ఆమె వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో 16 ఎర్ర చందనం దుంగలు కనిపించాయి. దీంతో ఆమెను పోలీసులు […]
Advertisement
ఎర్రచందనం దుంగలను తరలిస్తూ టీడీపీ మహిళా నేత పోలీసులకు పట్టుబడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా సిద్దవటం మండలం భాకరాపేట గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు ఏకుల రాజేశ్వరి తన స్కార్పియో వాహనంలో ఎర్రచందనం దుంగలతో బద్వేలు వైపు బయలు దేరారు. ఓ మహిళ ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అట్లూరు పోలీసులు అప్రమత్తమై కడప-బద్వేలు మార్గం మధ్యలో ఆమె వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో 16 ఎర్ర చందనం దుంగలు కనిపించాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తాను టీడీపీ నేతనని, కావాలంటే నిర్ధారించుకోండని ఆమె టీడీపీ ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడించారు.ఆ తర్వాత ఆమెను వదిలి పెట్టండంటూ పోలీసులకు టీడీపీ ప్రముఖుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో దిక్కుతోచని పోలీసులు ఆమె అరెస్టు విషయాన్ని గోప్యంగా ఉంచారు.
Advertisement