టీఆర్ఎస్ ఓ గురువింద : ఎల్.రమణ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎల్. రమణ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించిన రేవంత్‌ను బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తానని బెదిరించిన కేసీఆర్ అన్నట్టే ఓ అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో సుద్దులు చెబుతున్న తెలంగాణ నాయకులు 63 మంది ఎమ్మెల్సీలు ఉన్న టీఆర్‌ఎస్‌కు 85 ఓట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. గురువింద గింజకు తనకింద ఉన్న […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎల్. రమణ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించిన రేవంత్‌ను బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తానని బెదిరించిన కేసీఆర్ అన్నట్టే ఓ అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో సుద్దులు చెబుతున్న తెలంగాణ నాయకులు 63 మంది ఎమ్మెల్సీలు ఉన్న టీఆర్‌ఎస్‌కు 85 ఓట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. గురువింద గింజకు తనకింద ఉన్న నలుపు తెలియనట్టే టీఆర్ఎస్‌కు కూడా తమ తప్పులు తెలియడం లేదని రమణ అన్నారు. అదనంగా ఓట్లేసిన 22 మంది ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని రమణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో కుదుర్చుకున్న ఒప్పందాలు బయట పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఏజీ వాదనలున్నాయని మండిపడ్డారు. రాజకీయ నేతల వాదనను ఏజీ కోర్టులో వినిపించడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని రమణ ధ్వజమెత్తారు.
Advertisement