డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఫ్యాషన్ డిజైనర్
మద్యం తాగి కారు నడుపుతున్న ఓ ఫ్యాషన్ డిజైనర్ పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో దొరికిపోయింది. ఫిల్మ్‌నగర్ రోడ్డులో అర్ధరాత్రి దాటాక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సైనిక్‌పురికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ జెన్నీఫా పట్టుబడింది. తాను తాగలేదని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపైనా చిందులేసింది. చివరకు పోలీసుల రిక్వెస్ట్‌తో నిర్వహించిన పరీక్షలో ఆమె తాగినట్టుగా తేలింది. వెంటనే జెన్నీఫా కారును సీజ్ చేసి కేసు నమోదు […]
Advertisement
మద్యం తాగి కారు నడుపుతున్న ఓ ఫ్యాషన్ డిజైనర్ పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో దొరికిపోయింది. ఫిల్మ్‌నగర్ రోడ్డులో అర్ధరాత్రి దాటాక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సైనిక్‌పురికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ జెన్నీఫా పట్టుబడింది. తాను తాగలేదని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపైనా చిందులేసింది. చివరకు పోలీసుల రిక్వెస్ట్‌తో నిర్వహించిన పరీక్షలో ఆమె తాగినట్టుగా తేలింది. వెంటనే జెన్నీఫా కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఇలాంటి కేసుల్లో 37 మందికి జైలు శిక్ష
డ్రంకెన్ డ్రైవ్ చేసిన 37 మందికి జైలు శిక్ష, రూ.2వేల వరకు జరిమానా విధిస్తూ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిసే్ట్రట్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. వీరిలో ముగ్గురికి 5 రోజులు, 32 మందికి రెండు రోజులు, ఇద్దరికి ఒక్క రోజు శిక్ష విధించింది. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు డ్రంకెన్ డ్రైవ్ చేసిన 320 మంది డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ద్విచక్ర వాహనదారులు 251 మంది, ఆటో డ్రైవర్లు 8 మంది, 4చక్రాల వాహనదారులు 60 మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు.
Advertisement