కె.ఎఫ్.సి. చికెన్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా!
మదర్ డెయిరీ, నందినీ మిల్క్‌లో కూడా… ఆహార భద్రతలో మరో అంతర్జాతీయ సంస్థపై ఆరోపణలొచ్చాయి. కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) సంస్థ అందించే చికెన్‌లో ప్రమాదకర ఈ-కోలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు ఏపీ బాలల హక్కుల సంఘం తెలిపింది. మదర్ డెయిరీ, నందిని మిల్క్‌లో కూడా ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ లేబొరేటరీ దీన్ని నిర్ధారించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కేఎఫ్‌సీ ఉత్పత్తులపైనా నిషేధానికి డిమాండ్ చేశారు. మ్యాగీ నూడుల్స్‌పై తొలిసారి తెలంగాణలో […]
Advertisement
మదర్ డెయిరీ, నందినీ మిల్క్‌లో కూడా…
ఆహార భద్రతలో మరో అంతర్జాతీయ సంస్థపై ఆరోపణలొచ్చాయి. కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) సంస్థ అందించే చికెన్‌లో ప్రమాదకర ఈ-కోలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు ఏపీ బాలల హక్కుల సంఘం తెలిపింది. మదర్ డెయిరీ, నందిని మిల్క్‌లో కూడా ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ లేబొరేటరీ దీన్ని నిర్ధారించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కేఎఫ్‌సీ ఉత్పత్తులపైనా నిషేధానికి డిమాండ్ చేశారు. మ్యాగీ నూడుల్స్‌పై తొలిసారి తెలంగాణలో ఫిర్యాదు చేసిందీ ఈ సంస్థే. ఆ క్రమంలోనే పిల్లలు అమితంగా ఇష్టపడే ఫ్రైడ్ చికెన్ నమూనాలను హైదరాబాద్‌లో నాలుగు చోట్లగల కేఎఫ్‌సీ కేంద్రాల నుంచి సేకరించి సీల్డ్ బాక్స్‌లో ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లేబొరేటరీకి అందజేసింది. ఈ నెల 24న ల్యాబ్ ఇచ్చిన నివేదికలో చికెన్‌లో మోనోసోడియం గ్లూటామేట్‌తోపాటు ఈ-కోలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు పేర్కొంది. ఈ చికెన్‌ను తీసుకోవటం సురక్షితం కాదని స్పష్టంచేసింది. ఈ-కోలి వల్ల వాంతులు, డయేరియాలాంటి వ్యాధులు వస్తాయని, సాల్మోనెల్లావల్ల మెదడు మొద్దు బారుతుందని బాలల హక్కుల సంఘం ప్రతినిధి అనురాధా రావు చెప్పారు. ఇంతటి విషాన్ని చిన్నారులకి అందిస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. పలువురు పోషకాహార నిపుణులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని కేఎఫ్‌సీ తోసిపుచ్చింది. పిల్లల ఆహారంలో నాణ్యత కోసం సంఘం కొన్నేళ్లుగా కృషిచేస్తోంది.
‘పీడియా షూర్’ నుంచి దుర్వాసన
తిరువనంతపురం: చిన్నారుల పోషకాహారం ‘పీడియాషూర్’ దుర్వాసన వచ్చినట్లు కేరళలో ఒక ఫిర్యాదు రావడంతో అధికారులు ఈ బ్యాచ్ శాంపిల్స్ సేకరించారు. వాటిని ఉపసంహరించుకోవాలని కంపెనీని ఆదేశించారు.
Advertisement