తెలంగాణలో 3,620 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు
తెలంగాణ పోలీసు విభాగంలో 3,620 ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 315 పోస్టులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు, 1,305 పోస్టులను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పేరుతో ఈ పోస్టులను ఏర్పాటు చేసింది. కానీ హైదరాబాద్, సైబరాబాద్ సిటీ యూనిట్లలో అటువంటి పోస్టులు లేవని డీజీపీ కార్యాలయం అభ్యంతరం తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించిన […]
Advertisement
తెలంగాణ పోలీసు విభాగంలో 3,620 ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 315 పోస్టులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు, 1,305 పోస్టులను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పేరుతో ఈ పోస్టులను ఏర్పాటు చేసింది. కానీ హైదరాబాద్, సైబరాబాద్ సిటీ యూనిట్లలో అటువంటి పోస్టులు లేవని డీజీపీ కార్యాలయం అభ్యంతరం తెలిపింది. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ గతంలో మంజూరు చేసిన పోస్టుల పేర్లను ఆర్మడ్ రిజర్వు పోలీస్ కానిస్టేబుల్‌గా మార్చినట్లు తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ప్రత్యేక అధికారుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక అధికారులుగా తాత్కాలిక పద్ధతిలో పని చేయడానికి ప్రభుత్వ గురుకుల కళాశాలలో పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ మల్లయ్య భట్టు తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 30 లోపు mjpapbcwreis@gmail.com కు బయోడేటా పంపాలని, వివరాల కోసం 040- 24602266లో సంప్రదించాలని ఆయన తెలిపారు.
Advertisement