మ‌ళ్లీ రాజుకుంటున్న మ‌ద్య‌నిషేధ ఉద్య‌మం

మ‌ద్య‌నిషేధ ఉద్య‌మం మ‌ళ్లీ రాజుకుంటున్న‌దా…? మ‌హిళ‌లు మ‌ద్యం మ‌హ‌మ్మారిపై మ‌రోసారి క‌త్తులు దూయ‌బోతున్నారా..?  చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్‌ పాలసీని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జ‌రుగుతున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ఈ ప‌రిణామాన్నే సూచిస్తున్నాయి. విశాఖపట్నంలో గురువారం మహిళా సంఘాలు చేప‌ట్టిన నిర‌స‌నలో మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  మహిళలు జగదాంబ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తెన్నేటి జంక్షన్‌ దాటి ముందుకు సాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మద్యం వద్దు మంచినీళ్లు కావాలి, షాపింగ్‌ మాల్స్‌లో కూడా మద్యం […]

Advertisement
Update:2015-06-26 02:50 IST
మ‌ద్య‌నిషేధ ఉద్య‌మం మ‌ళ్లీ రాజుకుంటున్న‌దా…? మ‌హిళ‌లు మ‌ద్యం మ‌హ‌మ్మారిపై మ‌రోసారి క‌త్తులు దూయ‌బోతున్నారా..? చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్‌ పాలసీని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జ‌రుగుతున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ఈ ప‌రిణామాన్నే సూచిస్తున్నాయి. విశాఖపట్నంలో గురువారం మహిళా సంఘాలు చేప‌ట్టిన నిర‌స‌నలో మ‌హిళ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు జగదాంబ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తెన్నేటి జంక్షన్‌ దాటి ముందుకు సాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మద్యం వద్దు మంచినీళ్లు కావాలి, షాపింగ్‌ మాల్స్‌లో కూడా మద్యం అమ్మకాలు జరిపేలా చేస్తామనడం దుర్మార్గమంటూ మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చంద్రబాబు మాస్క్‌కు మద్యం పడుతున్నట్లు కొందరు మహిళలు మద్యం సీసాలను ఉంచి నిరసన తెలిపారు. మరికొందరు నూతన ఎక్సైజ్‌ పాలసీ జీవోలను చించివేశారు. చంద్రబాబు మాస్క్‌ను కొందరు మహిళలు దహనం చేయగా, మరికొందరు మహిళలు మాస్క్‌లను కాళ్లతో తొక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆగ్రహించారు. దొరికిన వారిని దొరికనట్టుగా బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లో పడేసి టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రాన్ని మద్యాంద్ర ప్రదేశ్‌గా మార్చే విధంగా చంద్ర‌బాబు మద్యం పాలసీ ఉందని మహిళ‌లు విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయంగా తెలుగుదేశం ప్రభుత్వం చూడ‌డం సిగ్గుచేటని అన్నారు. షాపింగ్‌ మాల్స్‌లో కూడా మద్యం దొరికే విధంగా, ప్రతి మండ లానికి ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పెట్టే విధంగా ఈ పాలసీలో పేర్కొనడం దుర్మార్గమన్నారు.
Tags:    
Advertisement

Similar News