సెక్షన్-8కి షెడ్యూల్ 10తో జవాబు... ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు
ఓటుకు కోట్లు కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కుపోయిన తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన సహచరులు సెక్షన్ -8 వివాదాన్ని రేపి జనం దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటే దానికి జవాబుగా టీఆర్ ఎస్ షెడ్యూల్ 10ని ముందుకు తెచ్చింది. నిజానికి పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ -8 ఎప్పుడూ అమల్లోనే ఉంది. దానిని కొత్తగా అమలు చేయాల్సిన అవసరమేమీ లేదు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితిని అదుపుచేయడానికి గాను గవర్నర్‌కు ఈ విచక్షణాధికారం ఉంటుంది. ఇపుడు […]
Advertisement
ఓటుకు కోట్లు కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కుపోయిన తెలుగుదేశం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన సహచరులు సెక్షన్ -8 వివాదాన్ని రేపి జనం దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటే దానికి జవాబుగా టీఆర్ ఎస్ షెడ్యూల్ 10ని ముందుకు తెచ్చింది. నిజానికి పునర్విభజన చట్టం ప్రకారం సెక్షన్ -8 ఎప్పుడూ అమల్లోనే ఉంది. దానిని కొత్తగా అమలు చేయాల్సిన అవసరమేమీ లేదు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితిని అదుపుచేయడానికి గాను గవర్నర్‌కు ఈ విచక్షణాధికారం ఉంటుంది. ఇపుడు అలాంటి పరిస్థితులేవీ లేవు. కేవలం ఓటుకు కోట్లు కుంభకోణం నుంచి జనం దృష్టిని మరల్చడం కోసమే తెలుగుదేశం సెక్షన్ -8ని ముందుకు తీసుకువచ్చిందనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే టీఆర్ ఎస్ కూడా తక్కువేమీ తినలేదు. వారు తాజాగా పదో షెడ్యూల్‌ని ముందుకు తెచ్చారు. పునర్విభజన చట్టం -2014లోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చేత చెప్పించారు. ఆ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల నిర్వహణ, పాలనా వ్యవహారాలపై సర్వహక్కులు తెలంగాణ ప్రభుత్వానికే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. చట్టంలోని 9,10 షెడ్యూల్స్ లోని సంస్థల అంశాలపై చర్చించడం కోసం రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంస్థలన్నిటిపైనా తెలంగాణ సర్కార్‌కే సర్వాధికారాలూ ఉంటాయని, ఒక వేళ ఏపీ సర్కార్ నియమనిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడొద్దని ఉన్నతాధికారులకు రాజీవ్‌శర్మ సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయా సంస్థల నుంచి ఏవైనా సేవలు పొందాలని ఏపీ సర్కార్ భావిస్తే ముందుగా తెలంగాణ సర్కార్ తో ఒప్పందం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆ సేవలకు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి విషయంలో తల బొప్పి కట్టించుకున్న చంద్రబాబు సర్కారుకు ఇపుడు షెడ్యూల్ 10 గురించి తెలంగాణ సీఎస్ చేసిన ప్రకటన మరింత తలనొప్పిగా మారడం ఖాయం. పదో షెడ్యూల్‌పై ఎలా స్పందించాలి..? ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఎటువైపు అడుగులు వేయాలి…? అన్నదానిపై చంద్రబాబు న్యాయ నిపుణులతోను, సీనియర్ మంత్రులతోనూ సంప్రదించనున్నట్లు అధికారవర్గాలంటున్నాయి.
Advertisement