కార్పొరేటు కాలేజీల దోపిడీపై ఆర్ కృష్ణయ్య ధ్వజం
తెలంగాణలో కార్పొరేటు కాలేజీల దోపిడీని అరికట్టాలని, ఈ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు శాసనసభలో చట్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి ఆయన కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాపాయింట్లో మాట్లాడుతూ సామాన్యుల పిల్లలకు మంచి చదువు దొరకని పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఫీజుల పేరుతో కార్పొరేట్‌కాలేజీలు దోపిడీ చేస్తున్నాయని, దీన్ని అడ్డుకోవలసిన ప్రభుత్వాలు ప్రలోభాలకు లొంగి చూసీ […]
Advertisement
తెలంగాణలో కార్పొరేటు కాలేజీల దోపిడీని అరికట్టాలని, ఈ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు శాసనసభలో చట్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి ఆయన కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాపాయింట్లో మాట్లాడుతూ సామాన్యుల పిల్లలకు మంచి చదువు దొరకని పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఫీజుల పేరుతో కార్పొరేట్‌కాలేజీలు దోపిడీ చేస్తున్నాయని, దీన్ని అడ్డుకోవలసిన ప్రభుత్వాలు ప్రలోభాలకు లొంగి చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేట్ కాలేజీల దోపిడీని ఆపాలని, ఫీజులను నియంత్రించాలని డిమాండు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ విద్యకు ప్రోత్సాహం కల్పించాలని, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, కాలేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లను క్రమేణా మూసేస్తున్నారని, ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం విషయంలో టీచర్ల యూనియన్లూ తమ పాత్ర పోషించాలని కోరారు. అన్ని చేతులు కలిస్తే తప్ప విద్యా వ్యవస్థ బలోపేతం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
Advertisement