మిల్లెట్స్ చేసే మేళ్లెన్నో...!
సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు… ఇవన్నీ చిరు/తృణధాన్యాలే. వీటన్నింటినీ ఇంగ్లిష్‌లో మిల్లెట్స్ అంటారు. ఆధునిక జీవనశైలి… బాగా పాలిష్ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారినపడటం పెరిగింది. ఈ పరిస్థితుల్లో మిల్లెట్స్‌ని రోజూవారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉంది. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పీచు ఎక్కువగా ఉండటంతో వీటి పిండితో రుచికరమైన వంటలు చేయలేం. చూడ్డానికీ అంత బాగుండవు. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు […]
Advertisement
సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు… ఇవన్నీ చిరు/తృణధాన్యాలే. వీటన్నింటినీ ఇంగ్లిష్‌లో మిల్లెట్స్ అంటారు. ఆధునిక జీవనశైలి… బాగా పాలిష్ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారినపడటం పెరిగింది. ఈ పరిస్థితుల్లో మిల్లెట్స్‌ని రోజూవారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉంది. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పీచు ఎక్కువగా ఉండటంతో వీటి పిండితో రుచికరమైన వంటలు చేయలేం. చూడ్డానికీ అంత బాగుండవు. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు పొట్టు తీసి, పీచును తగ్గించి మృదువైన పిండిని తయారుచేసే యంత్రాలు చాలానే వచ్చాయి. వీటిద్వారా పిండి, రవ్వ పట్టిస్తే అన్ని రకాలూ చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
- బియ్యం, జొన్నల్లో మాదిరి పిండి పదార్ధాలూ గోధుమల్లోని ప్రొటీన్లూ మాత్రమే కాక కొద్దిపాళ్లలో కొవ్వులూ చిరుధాన్యాల్లో ఉంటాయి. అందుకే ఇవి సమతులాహారంగా ఉపయోగపడతాయి.
- చిరుధాన్యాలన్నింటిలోనూ బి-విటమిన్ శాతం ఎక్కువ. ఐరన్, కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్… ఖనిజాలన్నీ సమృద్ధిగా ఉంటాయి.
- 100 గ్రా. రాగుల నుంచి 344 మి.గ్రా. కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటంవల్ల దంతాలూ ఎముకల పరిపుష్టికి రాగులు దోహదపడతాయి.
- చిరుధాన్యాల్లో అధికంగా ఉండే మెగ్నీషియం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువ. ముఖ్యంగా కొర్రలవల్ల మధుమేహం తగ్గుతుంది.
- పీచు ఎక్కువగా ఉండటంవల్ల చిరుధాన్యాల్లోని పిండిపదార్థాలు మెల్లగా జీర్ణమవుతాయి. గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంటుంది. అందుకే మధుమేహరోగులకి ఇవి ఎంతో మంచివి.
- పీచు ఎక్కువగా ఉండడం వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడవు.
- మిల్లెట్స్‌లో ఫైటేట్స్, టానిన్స్ అనే యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌నీ మధుమేహాన్నీ తగ్గిస్తాయి.
- చిరుధాన్యాలలోని ఫైటేట్స్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ క్యాన్సర్లూ, గుండెవ్యాధులు రాకుండానూ కూడా కాపాడతాయి.
- అలర్జీ కలిగించే గుణం ఉండదు. అందుకే చిరుధాన్యాల మొలకల్ని పిండి పట్టించి, వండిన ముద్దను పిల్లలకీ, పాలిచ్చే తల్లులకీ, ముసలివాళ్లకీ కూడా పెడుతుంటారు.
Advertisement