బాహుబలి సినిమా ప్రేరణ పేరుతో కాపియింగ్ ..!
ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ తో పాటు.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి. దర్శక జక్కన్న రాజమౌళి అండ్ హిజ్ టీమ్ చెక్కిన బాహుబలి పై విమర్శకులు కాపి బాణాలు బాగా ఎక్కు పెట్టారు. ఈ సినిమా మొదటి పబ్లిసిటి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మొన్నటి ట్రైలర్ వరకు హాలీవుడ్ చిత్రాల ప్రేరణ పేరు తో కాపి చేశారంటూ విమర్శలు వెల్లు వెత్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి ట్రైలర్ […]
ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ తో పాటు.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి. దర్శక జక్కన్న రాజమౌళి అండ్ హిజ్ టీమ్ చెక్కిన బాహుబలి పై విమర్శకులు కాపి బాణాలు బాగా ఎక్కు పెట్టారు. ఈ సినిమా మొదటి పబ్లిసిటి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మొన్నటి ట్రైలర్ వరకు హాలీవుడ్ చిత్రాల ప్రేరణ పేరు తో కాపి చేశారంటూ విమర్శలు వెల్లు వెత్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి ట్రైలర్ సినిమా ప్రేరణ పేరు తో హాలీవుడ్ లో వచ్చిన '300 వందల యోథలు' చిత్రం కాపి అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి సోషల్ నెట్ వర్క్ లో వదిలిన మొదటి పోస్టర్ . నీళ్లలో నుంచి పైకి లేచిన ఒక మహిళ చేయి పసి బాలుణ్ణి పట్టుకున్న చిత్రం. ఇది హాలీవుడ్ లోమార్క్ స్టివెన్ జాన్ సన్ డైరెక్టర్ చేసిన 'సిమోన్ బిర్క్' అనే సినిమా పోస్టర్ ను కాపి కొట్టినట్లు వాదంతలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీషు చిత్రంలో రెండు చేతుల్లో పసి బాలుడు వుంటాడు. మన రాజమౌళి ఆ పోస్టర్ ను స్లైట్ గా ఛేంజ్ చేసి ఒక చేతిలో ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు అంతకు మించి ఏమి లేదు.
ఇక ఎంతో కాలంగా బందీగా వున్నట్లు వదిలిన అనుష్క పోస్టర్ కూడా కాపి అంటున్నారు విమర్శకులు. రెండు వేల పదమూడు సంవత్సరంలో డేవిడ్ ఏ ఆర్ వైట్ చేసిన హాలీవుడ్ ఫిల్మ్ 'ది బుక్ ఆఫ్ ఈస్టర్' అనే చిత్రం నుంచి కాపి కొట్టినట్లు సోషల్ నెట్ వర్క్ లో క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ కాపియింగ్ మ్యాటర్ కు బాహుబలి నిర్మాతలు గానీ..దర్శకులు రాజమౌళి గాని ఎవరు పెదవి విప్పడం లేదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు కొన్ని ప్రేరణలు వుంటాయి. ఒక్కోసారి ఆ డోస్ ఎక్కువైయితే ప్రేరణ ను మించి పోవచ్చు. బాహుబలి మేకింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సార్లు ప్రేరణను మించి పోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఏది చేసినా..ఎన్ని చేసిన కథను మన ఆడియన్స్ కు తగ్గట్లు మలచి సినిమాను జన రంజకం చేయడం అనేది ముఖ్యాంశంగా కనిస్తుంది. ఎందుకంటే..సినిమా బడ్జెట్ టాలీవుడ్ ఇండస్ట్రీ స్టామినాను మించి పెట్టారు. దాదాపు రెండు వందల కోట్లు పెట్టినట్లు తెలస్తుంది. మరి అంతటి భారీ ప్రాజెక్ట్ ను బిజినెస్ పరంగా విజయం వంతం చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది అనేది బాహుబలి అభిమానుల వాదన. ఏది ఏమైన బాహుబలి చిత్రం అభిమానుల చేత ఔర అనిపించుకోవడం ఖాయం అనేది అందరి మాట.