హస్తినలో గవర్నర్ హడావుడి భేటీలు
ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు… హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో తెలీదు… మొత్తం మీద ఈసారి ఢిల్లీ పర్యటనలో గవర్నర్ చాలా హడావుడిగా కనిపించారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌సింగ్‌ను, హోం శాఖ కార్యదర్శి గోయల్‌ను కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల తాజా పరిణామాలను వారికి వివరించారు. తొలుత గోయల్‌తో సమావేశమైన నరసింహన్ ఆ తర్వాత అధికారులతో కలిసి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. […]
Advertisement
ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు… హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో తెలీదు… మొత్తం మీద ఈసారి ఢిల్లీ పర్యటనలో గవర్నర్ చాలా హడావుడిగా కనిపించారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌సింగ్‌ను, హోం శాఖ కార్యదర్శి గోయల్‌ను కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల తాజా పరిణామాలను వారికి వివరించారు. తొలుత గోయల్‌తో సమావేశమైన నరసింహన్ ఆ తర్వాత అధికారులతో కలిసి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు 45 నిమషాలపాటు జరిగింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో పావుగంటపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ముగిసిన వెంటనే మళ్ళీ గవర్నర్ హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో సెక్షన్ 8 అమలు చేస్తే లాభనష్టాలు… నోటుకు ఓటు కేసులో తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలిసింది. సెక్షన్ 8పై గవర్నర్ తన అభిప్రాయాలు కూడా తెలిపారని తెలుస్తోంది. వీరితో సమావేశాలు ముగిసిన తర్వాత గవర్నర్ నరసింహన్ మీడియాతో ఎటువంటి మాటలకు తావివ్వకుండా వెళ్ళిపోయారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అంశం, ఏసీబీ కోర్టులో కేసుల తాజా పరిస్థితి కూడా వివరించినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ సమావేశాలు సాధారణంగా జరిగేవేనని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. సాయంత్రంలోపు ఆయన రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తారా లేక హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు.
Advertisement