ఓటుకు నోటు నేరమే: భన్వర్‌లాల్
ఓటుకు నోటు కేసులో లంచం ఎరచూపడం ముమ్మాటికీ నేరమే అవుతుందని తెలుగు రాష్ర్టాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా డబ్బులతో ప్రలోభపెట్టడం అవినీతి చర్యేనని కుండబద్దలు కొట్టారు. ఈ కేసుపై ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఏసీబీ డీజీ ఖాన్ ఈసీకి అందించిన సంగతి తెలిసిందే. గురువారం ఈకేసులో కీలక సాక్ష్యాలైన ఆడియో, వీడియో టేపులు ఇవ్వాలని ఈసీ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో ఓటుకు నోటు కేసులో ఈసీ […]
Advertisement
ఓటుకు నోటు కేసులో లంచం ఎరచూపడం ముమ్మాటికీ నేరమే అవుతుందని తెలుగు రాష్ర్టాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా డబ్బులతో ప్రలోభపెట్టడం అవినీతి చర్యేనని కుండబద్దలు కొట్టారు. ఈ కేసుపై ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఏసీబీ డీజీ ఖాన్ ఈసీకి అందించిన సంగతి తెలిసిందే. గురువారం ఈకేసులో కీలక సాక్ష్యాలైన ఆడియో, వీడియో టేపులు ఇవ్వాలని ఈసీ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో ఓటుకు నోటు కేసులో ఈసీ ప్రతక్ష్యంగా రంగంలోకి దిగినట్లు అయింది. ఈ కేసును తామే దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని సివిల్, ఏసీబీ, సీఐడీ ఎవరైనా దర్యాప్తు చేయవచ్చని స్పష్టంచేశారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి నివేదిక పంపుతామని, కోర్టు తీర్పు తరువాత ఈసీ చర్యలు ఉంటాయని వివరించారు. ఇంతకాలం ఈ కేసును ఈసీ పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తూ వస్తోన్న టీడీపీ మంత్రులకు భన్వర్‌లాల్ వ్యాఖ్యలతో చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈ విషయంలో మొదటి నుంచి టీడీపీ వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అరెస్టు చేసిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ విషయాన్ని ఖండించడం లేదు. తమ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియోటేపులు నిజమైనవేని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిందని వార్తలు వస్తున్నా.. వాటిపైనా నోరు మెదపడం లేదు. గవర్నర్‌ను నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారు. సెక్షన్-8 అంటూ కొత్త వివాదాన్ని లేవదీస్తున్నారు. కానీ, అసలు తమ నేతలపై నమోదైన కేసులపై మౌనం వహిస్తున్నారు.
Advertisement