చర్చలు సఫలం... లారీల సమ్మె విరమణ
లారీ యజమానులతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు ఫలించాయి. సింగిల్ స్టేట్ పర్మిట్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సింగిల్ పర్మిట్ విధానంపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారంలోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం అవడంతో తెలంగాణ వ్యాప్తంగా తమ సమ్మెను విరమిస్తున్నట్టు లారీ యాజమానులు ప్రకటించారు. ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీలో కమర్షియల్ టాక్స్, రవాణా, రహదారులు, భవనాల శాఖ, పోలీసు విభాగాలు […]
Advertisement
లారీ యజమానులతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు ఫలించాయి. సింగిల్ స్టేట్ పర్మిట్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సింగిల్ పర్మిట్ విధానంపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారంలోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రులు హరీష్‌రావు, మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం అవడంతో తెలంగాణ వ్యాప్తంగా తమ సమ్మెను విరమిస్తున్నట్టు లారీ యాజమానులు ప్రకటించారు. ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీలో కమర్షియల్ టాక్స్, రవాణా, రహదారులు, భవనాల శాఖ, పోలీసు విభాగాలు ఉంటాయని మంత్రులు వివరించారు.
Advertisement