జాయింట్స్ నొప్పిని నివారించే ఆహారం
మన శరీరంలోని ప్రతి కదలికకూ మూలం … కీలే. జాయింట్లు మృదువుగా, సజావుగా, సన్నిహితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, భుజం, మోకాలి కీళ్లు, చివరకు పాదాల వేళ్ల జాయింట్లు కావచ్చు. దేనికైనా… ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. అందుకే జాయింట్స్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వాటికి చిన్న డ్యామేజ్ అయినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో చాలా తీవ్రమైన ప్రభావం చూపడంతో […]
మన శరీరంలోని ప్రతి కదలికకూ మూలం … కీలే. జాయింట్లు మృదువుగా, సజావుగా, సన్నిహితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, భుజం, మోకాలి కీళ్లు, చివరకు పాదాల వేళ్ల జాయింట్లు కావచ్చు. దేనికైనా… ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. అందుకే జాయింట్స్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వాటికి చిన్న డ్యామేజ్ అయినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో చాలా తీవ్రమైన ప్రభావం చూపడంతో పాటు చికిత్స చేయించుకోడానికి కూడా కష్టంగా మారుతుంది. కీళ్ల సమస్యల బారి నుంచి తప్పించుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి.
జాయింట్స్‌ను ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ఆహారం
సాల్మన్ ఫిష్
దీనిలో ప్రోటీన్ విరివిగా లభిస్తుంది. వారానికి మూడు సార్లు సాల్మన్ ఫిష్ తీసుకోవడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. సాల్మన్ ఫిష్‌లో ఉండే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి పోతుంది. జీవక్రియ మెరుగు పడుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణను బాగా పెంచుతుంది.
బాదం పప్పు
కీళ్లవాపులు దీర్ఘకాలం నుంచి ఉన్నవారికి ముందు ముందు జాయింట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ జాయింట్ పెయిన్స్‌కు కారణమవుతాయి. అలా జరగకుండా బాదం పప్పు రక్షణ కల్పిస్తాయి. జాయింట్స్ డ్యామేజ్ కాకుండా బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జాయింట్ నొప్పులను తగ్గిస్తాయి.
బొప్పాయి
బొప్పాయిలోని విటమిన్ సి మరియు పెపైన్ వలన జాయింట్స్ నొప్పులు తగ్గుతాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండుట వలన ఇది జాయింట్స్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. సి విటమిన్ లోపాన్ని నివారిస్తుంది.
కాలే
ఎముకలు పెళుసు బారినప్పుడు కీళ్ళ నొప్పులు మరియు వాపులు ప్రారంభమవుతాయి. వీటి బారిన పడిన వారు కాలేను ఆహారంలో చేర్చుకోవాలి. కాలేలో ఉండే క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎముకలను శక్తివంతంగా చేయడానికి సహాయ పడుతుంది. కోలీలో కాపర్ అధికంగా ఉండుట వలన కొల్లాజన్ మరియు లింగ్మెంట్ పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే మెగ్నీషియం కీళ్ల నొప్పులకు నివారించుటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
బ్రొకోలి
జాయింట్ పెయిన్‌కు శరీరంలోని ఫ్రీరాడికల్స్ కారణం అవుతాయి. ఈ ప్రీరాడికల్ వల్ల కలిగే జాయింట్ పెయిన్‌ను నివారించే శక్తి బ్రొకోలీలో ఉంటుంది. బ్రొకోలీలో క్యాల్షియం అధికంగా ఉండుట వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.